- Telugu News Photo Gallery Cinema photos Mr bachchan heroin Bhagyashri Borse double ismart heroin Kavya Thapar are now trending in social media
ఆ రెండు సినిమాలకు ఆ ముద్దుగుమ్మల అందాలే పెట్టుబడి !! ఇంతకీ ఆ మూవీస్ ఏంటంటే ??
వెండితెరపై అందాన్ని అందంగా చూపించడం కూడా ఓ కళే. అది అందరికీ రాదు.. కొందరు దర్శకులకు మాత్రమే అది సాధ్యం. తాజాగా ఇద్దరూ దర్శకులు ఇదే చేస్తున్నారు.. పైగా వాళ్లు గురు శిష్యులు.. స్క్రీన్‌ను గ్లామర్‌తో నింపేయడంలో సిద్ధ హస్తులు.. ఆ రెండు సినిమాలకు హీరోయిన్స్ అందాలే పెట్టుబడి..! ఒక్కో పాట విడుదలవుతుంటే.. గ్లామర్ షో పెరిగిపోతుంది. ఇంతకీ ఏంటా సినిమాలు..?
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Aug 01, 2024 | 10:39 PM

వెండితెరపై అందాన్ని అందంగా చూపించడం కూడా ఓ కళే. అది అందరికీ రాదు.. కొందరు దర్శకులకు మాత్రమే అది సాధ్యం. తాజాగా ఇద్దరూ దర్శకులు ఇదే చేస్తున్నారు.. పైగా వాళ్లు గురు శిష్యులు.. స్క్రీన్‌ను గ్లామర్‌తో నింపేయడంలో సిద్ధ హస్తులు.. ఆ రెండు సినిమాలకు హీరోయిన్స్ అందాలే పెట్టుబడి..! ఒక్కో పాట విడుదలవుతుంటే.. గ్లామర్ షో పెరిగిపోతుంది. ఇంతకీ ఏంటా సినిమాలు..?

మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంది. రెండూ ఒకేరోజు వస్తుండటం.. అది నచ్చని డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మి ఇటు రవితేజ, అటు హరీష్ శంకర్‌ను అన్‌ఫాలో చేయడంతో ఇష్యూ మరింత పెద్దదైంది.

ఇది కాకుండా రెండు సినిమాల్లోనూ హీరోయిన్స్ గ్లామర్ షో హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ఇటు డబుల్ ఇస్మార్ట్.. అటు మిస్టర్ బచ్చన్ సినిమాల్లో హీరోయిన్స్ గ్లామర్ షో నెక్ట్స్ లెవల్‌లో ఉంది. డబుల్ ఇస్మార్ట్ కోసం ఏ మాత్రం మొహమాటాలు లేకుండా రెచ్చిపోతుంది కావ్య తపర్. రాక రాక వచ్చిన ఛాన్స్ కావడంతో.. నో కాంప్రమైజ్ అంటున్నారీమె.

మరోవైపు తొలి సినిమా విడుదల కాకముందే.. తన గ్లామర్‌తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు భాగ్య శ్రీ బోర్సే. ఇటు భాగ్య శ్రీ.. అటు కావ్య తపర్ అందాలే పెట్టుబడిగా డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వచ్చేస్తున్నాయి.

ఓ అడుగు ముందుకేసి స్టేజ్ మీద కూడా చిందేస్తున్నారు భాగ్య శ్రీ బోర్సే. మరోవైపు డబుల్ ఇస్మార్ట్ నుంచి తాజాగా విడుదలైన క్యా లఫ్‌డా సాంగ్‌లోనూ కావ్య తపర్ గ్లామర్ షో అదిరింది. మొత్తానికి ఈ బ్యూటీస్ కెరీర్‌కు ఈ రెండు సినిమాలు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.