Christmas Movies: సరికొత్త సినిమాలతో క్రిస్మస్ సందడి మొదలు.. ఏంటా మూవీస్.?
క్రిస్మస్ పండగ అంటే సినిమా సందడి కూడా పక్క. ఈసారి వరుస చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. గత రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద ‘పుష్పరాజ్’ హవా కనిపిస్తుంది. ఇప్పుడు మరికొన్ని సరికొత్త చిత్రాలు క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఆ మూవీ ఏంటి.? ఎప్పుడు రానున్నాయి.? ఈరోజు తెలుసుకుందాం.. రండి..
Updated on: Dec 16, 2024 | 3:45 PM


ప్రియదర్శి హీరోగా, రూప కొడువాయూర్ హీరోయిన్గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ కామెడీ రొమాంటిక్ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వస్తున్న ఫాంటసీ చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, జి.మనోహరన్ అండ్ వీనస్ ఎంటర్‌టైనర్స్, కేపీ శ్రీకాంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబరు 20న క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ విడుదల కానుంది.

సూరి, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విడుదల’కి కొనసాగింపుగా వస్తున్న చిత్రం ‘విడుదల పార్ట్ 2’. వెట్రిమారన్ రూపొందించింది ఈ పీరియాడికల్ మూవీ ఈ నెల 20న థియేటర్లలో సందడి చేయనుంది.

వీటిపాటు ఓ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 20న ప్రేక్షకులను అలరించనుంది. అదే డిస్నీ పిక్చర్స్ నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్ ’. ఇది 2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్ ’ సినిమాకి ప్రీక్వెల్. దీనికి మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో దీని క్రేజ్ మరింత పెరిగింది.




