Megastar Chiranjeevi: చిరంజీవి మెగా ప్లానింగ్.. తక్కువంచనా వేసారో అంతే ఇక !!

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసుంటాడు చిరంజీవి. ఆయనకు హిట్లు కొత్త కాదు.. ఫ్లాపులు అంతకంటే కొత్త కాదు.. ఎన్నో డిజాస్టర్ సినిమాలు చేసాడు మెగాస్టార్. అయితే అప్పుడెప్పుడూ రాని నెగిటివిటీ ఈ మధ్య ఎక్కువగా చిరుపై వస్తుంది. బహుశా ఏజ్ పెరిగింది కాబట్టి ఆయన నుంచి ఇంకా మెచ్యూర్డ్ సినిమాలు అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో..? దాన్ని పట్టించుకోకుండా చిరు మాత్రం ఇంకా తన ఇమేజ్‌లోనే ఉండిపోయాడు.. ఇప్పటికీ కుర్రాడిలాగానే సినిమాలు చేయడానికి సై అంటున్నాడు. అక్కడే తేడా కొడుతున్నాయి ఆడియన్స్ ఆలోచనలతో మెగా ఆలోచనలు. అందుకే తనను తాను మార్చుకోడానికి ట్రై చేస్తున్నాడు చిరు.

Praveen Vadla

| Edited By: Phani CH

Updated on: Nov 23, 2023 | 2:55 PM

కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసుంటాడు చిరంజీవి. ఆయనకు హిట్లు కొత్త కాదు.. ఫ్లాపులు అంతకంటే కొత్త కాదు.. ఎన్నో డిజాస్టర్ సినిమాలు చేసాడు మెగాస్టార్. అయితే అప్పుడెప్పుడూ రాని నెగిటివిటీ ఈ మధ్య ఎక్కువగా చిరుపై వస్తుంది. బహుశా ఏజ్ పెరిగింది కాబట్టి ఆయన నుంచి ఇంకా మెచ్యూర్డ్ సినిమాలు అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారేమో..? దాన్ని పట్టించుకోకుండా చిరు మాత్రం ఇంకా తన ఇమేజ్‌లోనే ఉండిపోయాడు.. ఇప్పటికీ కుర్రాడిలాగానే సినిమాలు చేయడానికి సై అంటున్నాడు.

1 / 7
అక్కడే తేడా కొడుతున్నాయి ఆడియన్స్ ఆలోచనలతో మెగా ఆలోచనలు. అందుకే తనను తాను మార్చుకోడానికి ట్రై చేస్తున్నాడు చిరు. భోళా శంకర్ ఫ్లాప్ చిరులో చాలా మార్పులే తీసుకొచ్చింది. నిజానికి గతంలోనూ చిరు ఇంతకంటే దారుణమైన ఫ్లాపులు ఇచ్చాడు. హిట్లర్ కంటే ముందు మూడు నాలుగు సినిమాలు చిరును బాగా ఇబ్బంది పెట్టాయి.

2 / 7
అప్పుడు కూడా చిరంజీవి పని అయిపోయింది.. ఇక మెగాస్టార్ ఇంటికెళ్లాల్సిందే.. నెంబర్ వన్ చైర్ జారిపోయిందన్నారు. కానీ ఊహించని విధంగా కమ్ బ్యాక్ ఇచ్చాడు చిరు. హిట్లర్‌తో మొదలుపెట్టి.. మాస్టర్, చూడాలని ఉంది, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా వరకు బ్లాక్‌బస్టర్స్ ఇవ్వడమే కాదు.. వచ్చిన ప్రతీసారి ఇండస్ట్రీ రికార్డులతో కూడా చెడుగుడు ఆడుకున్నాడు చిరు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరు.. పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇండియాలో మరే హీరోకు సాధ్యం కాని విధంగా రీ ఎంట్రీలోనూ అదిరిపోయే హిట్ కొట్టాడు.

3 / 7
అమితాబ్ బచ్చన్ లాంటి హీరోను కూడా రీ ఎంట్రీలో రిసీవ్ చేసుకోలేదు ఆడియన్స్. కానీ చిరును మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకోవడమే కాదు.. ఖైదీ నెం 150కి ఏకంగా 100 కోట్ల షేర్ ఇచ్చారు. అప్పటి వరకు పదేళ్లుగా ఏ హీరోకు సాధ్యం కాని రికార్డును పదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చి అందుకున్నాడు చిరంజీవి. సైరాతోనూ 100 కోట్ల షేర్ అందుకున్నాడు మెగాస్టార్. అయితే ఆ తర్వాతే ఆయనకు బ్యాడ్ టైమ్ మొదలైంది. ఆచార్య, గాడ్ ఫాదర్ అంచనాలు అందుకోకపోవడం.. వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ అయినా.. దాన్ని మరిపించేలా భోళా శంకర్ బోల్తా పడటంతో చిరు ఇమేజ్ దారుణంగా దెబ్బతింది.

4 / 7
ఇలాంటి సమయంలో మళ్లీ తనను తాను నిరూపించుకోవాలని చూస్తున్నాడు చిరంజీవి. అందుకే కథల వేటలో పడ్డాడు. ఇప్పటికే వశిష్ట సినిమాను ఓకే చేసిన ఈయన.. డిసెంబర్ నుంచి దాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మరోవైపు ఈ సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్ కూడా ఒకేసారి మొదలు పెట్టాలని చూస్తున్నాడు చిరంజీవి. కళ్యాణ్ కృష్ణతో సినిమా ఓకే అయినా కూడా.. కథలో మార్పులు చేయాల్సి రావడంతో దాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టాడు మెగాస్టార్. అందుకే ఇతర దర్శకులు చెప్పే కథలు ఓపిగ్గా వింటున్నాడు.

5 / 7
ఈ లిస్టులో అనిల్ రావిపూడితో పాటు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఉన్నాడని తెలుస్తుంది. భగవంత్ కేసరి విడుదల తర్వాత చిరంజీవిని కలిసాడు అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడం పక్కా అంటున్నారు. మంచి ఎంటర్‌టైన్మెంట్‌తో ఉన్న కథను తీసుకొస్తే వెంటనే ఓకే చేయాలని చూస్తున్నాడు చిరంజీవి. కచ్చితంగా 2024లో కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్.

6 / 7
ఎలాగూ వశిష్ట సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది వచ్చే ఏడాది రావడం కష్టమే. అందుకే ఈ లోపు మరో సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు. కుదిర్తే ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ చేయాలనేది చిరు ప్లాన్. మొత్తానికి చూడాలిక.. మెగా ప్లానింగ్ అయితే రెడీగా ఉంది.. దాన్ని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేసే దర్శకులు ఎవరో..?

7 / 7
Follow us
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్

లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా

భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ

సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!

ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?

తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!

టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు

సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో

నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..