- Telugu News Photo Gallery Cinema photos Mega Star Chiranjeevi's Big Announcement 4 Movie Updates Coming Soon
Chiranjeevi: మెగాస్టార్ వరుస సినిమాల లైన్ అప్ తెలిస్తే.. ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
చిరంజీవి వరస సినిమాలు చేస్తున్నారని ఆనందపడాలో.. అక్కడ్నుంచి అప్‌డేట్స్ ఏవీ రావట్లేదని బాధ పడాలో తెలియని కన్ఫ్యూజన్‌లో ఉండిపోయారు మెగా ఫ్యాన్స్. అయితే వాళ్లందరి బాకీ ఒకేసారి తీర్చేయాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. దెబ్బకు కరువు మొత్తం తీరిపోవాలంటున్నారు. మరి అంతగా చిరు ఏం చేయబోతున్నారో తెలుసా..?
Updated on: Aug 04, 2025 | 9:15 PM

నిజంగానే పార్టీ రెడీ చేస్తున్నారు బాస్. ఈసారి చిరు బర్త్ డే బ్లాస్ట్ మామూలుగా ఉండేలా కనిపించడం లేదు.. చూస్తుంటే గట్టిగానే ఫుల్ మీల్స్ పెట్టేలా కనిపిస్తున్నారు. అభిమానులు వద్దనే వరకు సర్‌ప్రైజులు ఇవ్వాలని మాస్ ప్లానింగ్ రెడీ చేసారు మెగాస్టార్.

అన్నీ కుదిర్తే ఒకేసారి నాలుగు సినిమాల అప్‌డేట్స్ రానున్నాయి ఈ ఆగస్ట్ 22న..! చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరతో పాటు అనిల్ రావిపూడి సినిమాలు చేస్తున్నారు. ఇందులో వశిష్ట సినిమా షూట్ పూర్తైపోయింది.. ఈ మధ్యే బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్‌తో అదిరిపోయే స్పెషల్ సాంగ్‌లో చిందేసారు చిరు.

ఇక ఈ చిత్ర టీజర్ విత్ రిలీజ్ డేట్ ఆగస్ట్ 22న చెప్పబోతున్నారు. అక్టోబర్‌లో విశ్వంభర విడుదలయ్యేలా కనిపిస్తుంది. అనిల్ రావిపూడి సినిమా షూట్ కూడా వేగంగానే జరుగుతుంది. ఈ చిత్ర టైటిల్ ఆగస్ట్ 22న విడుదల చేయబోతున్నారు.

అన్నీ కుదిర్తే ఓ చిన్న డైలాగ్ టీజర్ కూడా రానుందని తెలుస్తుంది. ఈ సినిమాకు మన శివశంకర వర ప్రసాద్ అనే టైటిల్ దాదాపు ఖరారైంది. సంక్రాంతికి విడుదల కానుంది ఈ చిత్రం. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మెగా 156, 157 మాత్రమే కాదు.. 158 అనౌన్స్‌మెంట్ సైతం ఆగస్ట్ 22నే ఉండబోతుంది. వాల్తేరు వీరయ్య తర్వాత మరోసారి బాబీతోనే సినిమా చేయబోతున్నారు చిరు. మెగా 158 ప్రకటన బర్త్ డే రోజే రానుంది. అలాగే శ్రీకాంత్ ఓదెలతో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్‌డేట్ అదేరోజు రానుంది. మొత్తానికి ఈసారి చిరు పుట్టిన రోజంతా సందడే సందడి అన్నమాట.




