- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu, Prabhas, Chiranjeevi and other Tollywood celebs fly to Vijayawada to meet AP CM YS Jagan
Tollywood: ఏపీ సీఎం జగన్ కలిసిన టాలీవుడ్ బృందం.. చిరుతోపాటు మహేష్ , ప్రభాస్ కూడా..
టాలీవుడ్ సమస్యలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తో మరికాసేపట్లో సమావేశం కానున్నారు సినీ పెద్దలు. ఈ భేటీకోసం ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో సహా ప్రభాస్, మహేష్ బాబు..
Updated on: Feb 10, 2022 | 12:51 PM

సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ తో చర్చించేందుకు వెళ్లారు టాలీవుడ్ పెద్దలు.

పరిశ్రమకు సంబంధించి 17 అంశాలను సినీపెద్దలు సీఎం జగన్ ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు టాలీవుడ్ బృందం అనంతరం అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు.

చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ, నటుడు అలీ, నారాయణ మూర్తి జగన్ తో భేటీ అయ్యారు

మొత్తం 17 అంశాల అజెండాతో సీఎం జగన్‌తో సినీ పెద్దల మీటింగ్ ఉంటుందన్నది సమాచారం.

ఇక ఏపీ వెళ్లేందుకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ వచ్చిన చిరంజీవి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు సీఎంఓ నుంచి ఆహ్వానం అందిందని… మిగతా ఎవరు వస్తారో తెలీదు చూద్దాం అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

ఈ రోజుతో సమస్యలకు ఎండ్ కార్డు కాదు శుభం కార్డు పడుతందన్నారు.

సీఎం జగన్‌తో మీటింగ్ తర్వాత సమస్యలు పరిష్కారం అయితే వరసబెట్టి ప్యాన్ ఇండియా మూవీస్ థియేటర్‌లోకి వచ్చేస్తాయి.

తక్కువ మందే రావాలని మంత్రి పేర్నినాని సూచించడంతోనే పరిమిత సంఖ్యలోనే సినీ ప్రముఖులు జగన్‌తో భేటీ అయ్యారు




