- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu Daughter Sitara Ghattamaneni Enjoying Holiday in England, Watch Photos
Sitara Ghattamaneni: స్కాట్లాండ్ వీధుల్లో సితార.. మహేష్ బాబు కూతురు వెకేషన్ ఫోటోస్ చూశారా?
మహేష్ బాబు కుటుంబం ఇప్పుడు ఫారిన్ వెకేషన్‌లో ఉంది. ఇవాళ (ఆగస్టు9) మహేష్ బాబు పుట్టిన రోజు. ఈసారి ఫారిన్‌లోనే సూపర్ స్టార్ బర్త్ డే వేడుకలు జరగనున్నాయి. మహేష్‌తో పాటు భార్య నమ్రత కుమారుడు గౌతమ్, కుమార్తె సితార కూడా అక్కడే ఉంది. మొన్నటి వరకు లండన్‌లో గడిపారు మహేష్ ఫ్యామిలీ. అక్కడి అందాలను మనసారా ఆస్వాదించారు. ఇప్పుడు స్కాట్లాండ్‌లో ల్యాండ్ అయ్యారు. తాజాగా సితార స్కాట్లాండ్లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్ ధరించి ఎంతో క్యూట్‌గా కనిపించింది సితార.
Updated on: Aug 09, 2023 | 7:55 AM

మహేష్ బాబు కుటుంబం ఇప్పుడు ఫారిన్ వెకేషన్‌లో ఉంది. ఇవాళ (ఆగస్టు9) మహేష్ బాబు పుట్టిన రోజు. ఈసారి ఫారిన్‌లోనే సూపర్ స్టార్ బర్త్ డే వేడుకలు జరగనున్నాయి. మహేష్‌తో పాటు భార్య నమ్రత కుమారుడు గౌతమ్, కుమార్తె సితార కూడా అక్కడే ఉంది.

మొన్నటి వరకు లండన్‌లో గడిపారు మహేష్ ఫ్యామిలీ. అక్కడి అందాలను మనసారా ఆస్వాదించారు. ఇప్పుడు స్కాట్లాండ్‌లో ల్యాండ్ అయ్యారు. తాజాగా సితార స్కాట్లాండ్లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇందులో బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్ ధరించి ఎంతో క్యూట్‌గా కనిపించింది సితార.

ప్రస్తుతం స్కాట్లాండ్ టూర్‌లో ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ ఫ్యాన్స్‌ను, నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా కొన్ని రోజుల క్రితమే ఓ జ్యూవెలరీ యాడ్‌లో నటించింది సితార.

అలాగే న్యూయార్క్ లోని టైమ్ స్వ్కైర్‌పై దర్శనమిచ్చింది. అంతకుముందు మహేష్ నటించిన సర్కారు వారి పాట ప్రమోషన్ సాంగ్‌లో కనపించిందీ స్టార్ కిడ్. మొత్తానికి చిన్న వయసులోనే స్టార స్టేటస్‌ను సొంతం చేసుకుంది సితార.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు మహేష్ . త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దీని తర్వాత రాజమౌళి ప్రాజెక్టులో చేరనున్నాడు ప్రిన్స్




