- Telugu News Photo Gallery Cinema photos M.M. Keeravani doing music direction for multiple tollywood movies with big stars
M. M. Keeravani: అరడజన్ సినిమాలతో దూసుకుపోతున్న కీరవాణి..
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు.. ఎంఎం కీరవాణిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా.. వాళ్లందర్నీ తట్టుకుని నిలబడటం కాదు పోటీ ఇస్తున్నారీయన. చూస్తుంటే ఆయన టైమ్ మళ్లీ స్టార్ట్ అయిందనిపిస్తుంది. ఒకటి రెండూ కాదు.. ఏకంగా అరడజన్ క్రేజీ ప్రాజెక్టులతో రేసులోకి వచ్చేసారు కీరవాణి. టాలీవుడ్ మ్యూజిక్ అంతా ఇప్పుడు దేవీ, థమన్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడిప్పుడే అనిరుధ్ కూడా వస్తున్నారు.
Updated on: Feb 28, 2024 | 5:42 PM

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు.. ఎంఎం కీరవాణిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా.. వాళ్లందర్నీ తట్టుకుని నిలబడటం కాదు పోటీ ఇస్తున్నారీయన. చూస్తుంటే ఆయన టైమ్ మళ్లీ స్టార్ట్ అయిందనిపిస్తుంది. ఒకటి రెండూ కాదు.. ఏకంగా అరడజన్ క్రేజీ ప్రాజెక్టులతో రేసులోకి వచ్చేసారు కీరవాణి.

టాలీవుడ్ మ్యూజిక్ అంతా ఇప్పుడు దేవీ, థమన్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడిప్పుడే అనిరుధ్ కూడా వస్తున్నారు. వాళ్లు వదిలేస్తే మిగిలిన వాళ్లకు ఆఫర్స్ వెళ్తున్నాయేమో అనిపిస్తుంది. ఇంత పోటీలోనూ కీరవాణి సమ్‌థింగ్ స్పెషల్ అనిపిస్తున్నారు. ఈ సీనియర్ సంగీత దర్శకుడి కోసం దర్శకులే కాదు హీరోలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు కీరవాణి వైపే చూస్తున్నారు నిర్మాతలు.

రాజమౌళి సినిమాలకు ఎలాగూ కీరవాణి ఫిక్స్. అందులో పాటలు ఎలా ఉన్నా.. ఆర్ఆర్ మాత్రం అదిరిపోతుంది. ఎంత పెద్ద సినిమా తీసినా.. మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడరు రాజమౌళి. సోషియో ఫాంటసీలకు కీరవాణిని మించిన ఆప్షన్ లేదు. అందుకే హరిహర వీరమల్లుతో పాటు విశ్వంభర, SSMB29లకు కీరవాణినే తీసుకున్నారు. పవన్, మహేష్ ఇద్దరితోనూ మొదటిసారి పని చేస్తున్నారు కీరవాణి.

మొన్న సంక్రాంతికి నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగా సినిమాకు కీరవాణే సంగీతం అందించారు. కుర్ర హీరోలు కూడా ఈయన వైపే చూస్తున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి నటిస్తున్న మూడో సినిమాకు లవ్ మీ టైటిల్ ఖరారు చేసారు.

'లవ్ మీ' హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథ ఇది. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. దీనికి కీరవాణే సంగీత దర్శకుడు. మొత్తానికి కీరవాణి సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోతుంది.




