- Telugu News Photo Gallery Cinema photos List of Movies which announced release date but got delayed like Salaar DJ Tillu 2 Hanuman
Tollywood News: రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. తూచ్ అంటూ నెలల తరబడి వాయిదా పడుతున్న సినిమాలు..
వాయిదా పడితే 15 రోజులో.. నెల రోజులో పడుతుంది. కానీ ఈ మధ్య ట్రెండ్ మారిపోతుంది. ఎప్పుడూ అలాగే చేస్తే ఏం బాగుంటుంది అనుకుంటున్నారమో ఏమో కానీ ఏకంగా ఆర్నెళ్లు, ఏడాది పోస్ట్ పోన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు ఇదే జరిగింది. ముందు ఓ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. వెంటనే తూచ్ అంటూ నెలల తరబడి వాయిదా వేస్తున్నారు. ఈ రోజుల్లో వాయిదా పడకుండా ఓ సినిమా విడుదలైంది అంటే దర్శకుడికి చాలా విజన్ ఉన్నట్లు.. కథతో పాటు కంటెంట్ మీద కూడా క్లారిటీ ఉన్నట్లు. దాదాపు చాలా వరకు సినిమాలు అనుకున్న డేట్ కంటే వెనక్కే వెళ్తున్నాయి.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Oct 30, 2023 | 9:15 PM

వాయిదా పడితే 15 రోజులో.. నెల రోజులో పడుతుంది. కానీ ఈ మధ్య ట్రెండ్ మారిపోతుంది. ఎప్పుడూ అలాగే చేస్తే ఏం బాగుంటుంది అనుకుంటున్నారమో ఏమో కానీ ఏకంగా ఆర్నెళ్లు, ఏడాది పోస్ట్ పోన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు ఇదే జరిగింది. ముందు ఓ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. వెంటనే తూచ్ అంటూ నెలల తరబడి వాయిదా వేస్తున్నారు.

ఈ రోజుల్లో వాయిదా పడకుండా ఓ సినిమా విడుదలైంది అంటే దర్శకుడికి చాలా విజన్ ఉన్నట్లు.. కథతో పాటు కంటెంట్ మీద కూడా క్లారిటీ ఉన్నట్లు. దాదాపు చాలా వరకు సినిమాలు అనుకున్న డేట్ కంటే వెనక్కే వెళ్తున్నాయి. తాజాగా టిల్లు స్క్వేర్ అయితే ఈ ఏడాది రేస్ నుంచి తప్పుకుంది. ఆగస్ట్ నుంచి వాయిదా పడుతున్న టిల్లు సీక్వెల్.. ఫిబ్రవరి 9, 2024న విడుదల కానుంది.

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్‌పై అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకే హడావిడిగా సినిమా విడుదల చేయడానికి మేకర్స్ కూడా వెనకడుగు వేస్తున్నారు.

ఏ టెన్షన్ లేకుండా.. సంక్రాంతి సినిమాల సందడి తగ్గాక.. ఫిబ్రవరిలో రాబోతున్నారు. హనుమాన్ విషయంలోనూ ఇదే రూట్ ఫాలో అయ్యారు ప్రశాంత్ వర్మ. 2023 జూన్ నుంచి ఆర్నెళ్లు వాయిదా వేసి.. జనవరి 12న ముహూర్తం ఫిక్స్ చేసారు.

ప్రభాస్ సినిమాలకు ఈ వాయిదాల పర్వం ఎప్పట్నుంచో సాగుతుంది. ఒక్కో సినిమాను నెలల తరబడి పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఆ మధ్య ఆదిపురుష్ జనవరి నుంచి జూన్‌కు వచ్చింది. మొన్న సలార్ సెప్టెంబర్ 28న రావాల్సిన సినిమా కాస్తా డిసెంబర్ 22కి వాయిదా పడింది. సంక్రాంతికి వస్తుందని చెప్పిన ప్రాజెక్ట్ కే సమ్మర్‌కు వెళ్లింది. ఏదేమైనా పోస్ట్‌పోన్ అనేది కామన్ అయిపోయిందిప్పుడు.





























