- Telugu News Photo Gallery Cinema photos Priyanka Mohan re entry into films after 3 years with Pawan Kalyan Ravi Teja and Nani
Priyanka Mohan: రీఎంట్రీలో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ.. టాప్ హీరోలతో వరుస సినిమాలు
ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు అయితే సింగిల్ సినిమాతో జాతకం మారిపోతుంది. తాజాగా ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతుంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి.. పవన్ సినిమాతో పాటు నాని, రవితేజ కూడా ఆఫర్ ఇచ్చేసారు. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్..? ప్రియాంక మోహన్.. నాలుగేళ్ల కింద నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ఆ తర్వాత శర్వానంద్‌తో శ్రీకారంలో నటించారు ప్రియాంక. ఈ రెండూ ఫ్లాప్ కావడంతో అమ్మడు గురించి పెద్దగా చర్చ జరగలేదు.
Updated on: Oct 30, 2023 | 9:12 PM

ఇండస్ట్రీలో ఎవరి దశ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు అయితే సింగిల్ సినిమాతో జాతకం మారిపోతుంది. తాజాగా ఓ బ్యూటీ విషయంలో ఇదే జరుగుతుంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి.. పవన్ సినిమాతో పాటు నాని, రవితేజ కూడా ఆఫర్ ఇచ్చేసారు. ఇంతకీ ఎవరా లక్కీ హీరోయిన్..?

ప్రియాంక మోహన్.. నాలుగేళ్ల కింద నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్‌తో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ఆ తర్వాత శర్వానంద్‌తో శ్రీకారంలో నటించారు ప్రియాంక. ఈ రెండూ ఫ్లాప్ కావడంతో అమ్మడు గురించి పెద్దగా చర్చ జరగలేదు. దాంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి.. డాన్, డాక్టర్, ఈటీ లాంటి సినిమాలతో స్టార్ అయిపోయారు. ఇన్నాళ్లకు తెలుగులో మళ్లీ ప్రియాంకకు టైమ్ వచ్చింది.

ప్రియాంక మోహన్‌కు ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వరస ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో ఓజీలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. OG సెట్స్‌పై ఉండగానే నానితో సరిపోదా శనివారంలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయ్యారు. గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.

తమిళంలోనూ ఈమె బిజీగానే ఉన్నారు. ధనుష్ పాన్ ఇండియన్ సినిమా కెప్టెన్ మిల్లర్‌లోనూ ప్రియాంక మోహనే హీరోయిన్. జయం రవితోనూ బ్రదర్ సినిమాలో నటిస్తున్నారు ప్రియాంక.

తాజాగా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా ఖరారైనట్లు తెలుస్తుంది. మొత్తానికి ఒకేసారి మూడు క్రేజీ ఆఫర్స్‌తో ప్రియాంక టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయారు.




