- Telugu News Photo Gallery Cinema photos Latest updates from some other movies along with Mohanlal Vrushabha movie
Film Updates: వరుసగా 4 రోజులు.. రోజుకో మూవీ టీజర్.. మోహన్ లాల్ వృషభ నుంచి అప్డేట్..
అఖండ, వీరసింహారెడ్డి లాంటి విజయాలతో జోరు మీదున్నారు బాలయ్య. దసరా దండయాత్రకు వచ్చేస్తున్న సినిమాల్లో భగవంత్ కేసరి. తెలుగు ఇండస్ట్రీకి దసరా కాస్త ముందుగానే వచ్చేస్తుంది. అక్టోబర్ 15 నుంచి 4 రోజుల పాటు రోజుకో టీజర్ విడుదల కానుంది. చాలా రోజుల తర్వాత తెలంగాణ రాజకీయాల నేపథ్యంలోనూ ఓ సినిమా వస్తుంది. విజయ్, లోకేష్ కానకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లియో సినిమాలోని నే రెడీ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది.
Updated on: Oct 14, 2023 | 1:42 PM

అఖండ, వీరసింహారెడ్డి లాంటి విజయాలతో జోరు మీదున్నారు బాలయ్య. దసరా దండయాత్రకు వచ్చేస్తున్న సినిమాల్లో భగవంత్ కేసరి సెన్సార్ అయిపోయింది.. బాలయ్య 2023లోనే రెండోసారి యుద్ధానికి వచ్చేస్తున్నారు.. దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్. అక్టోబర్ 19న విడుదల కానుంది భగవంత్ కేసరి.

తెలుగు ఇండస్ట్రీకి దసరా కాస్త ముందుగానే వచ్చేస్తుంది. అక్టోబర్ 15 నుంచి 4 రోజుల పాటు రోజుకో టీజర్ విడుదల కానుంది. 15న నాని హాయ్ నాన్న.. 16న వెంకటేష్ సైంధవ్.. 17న నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. 18న విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమాకు సంబంధించిన టీజర్స్ విడుదల కానున్నాయి.

మోహన్ లాల్, రోషన్ మేక హీరోలుగా నందకిషోర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా వృషభ. ఈ సినిమా రెండో షెడ్యూల్ ముంబైలో మొదలైంది. అక్టోబర్, నవంబర్ అంతా అక్కడే షూట్ చేయనున్నారు. దసరాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు మేకర్స్. మలయాళంలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుంది ఈ చిత్రం.

ఇప్పటి వరకు 90 శాతం సినిమాలు ఏపీ పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చాయి. కానీ ఫస్ట్ టైమ్ చాలా రోజుల తర్వాత తెలంగాణ రాజకీయాల నేపథ్యంలోనూ ఓ సినిమా వస్తుంది. దాని పేరు KCR. ఈ పేరుకు తెలంగాణలో ఎంత ఇమేజ్ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇదే టైటిల్‌తో ఇప్పుడు బజర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా ఓ సినిమా వస్తుంది. తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది.

విజయ్, లోకేష్ కానకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న లియో సినిమాలోని నే రెడీ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. తమిళంలో ఎప్పుడో వచ్చిన ఈ పాట తెలుగు వర్షన్ ఇప్పుడు విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. తెలుగు వర్షన్ లిరిక్స్ రఘురామ్ రాయగా.. రేవంత్ పాడారు. అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు.




