- Telugu News Photo gallery Cinema photos Latest Heroines Follows Nayanthara and Deepika Padukone for the future projects Telugu Actress Photos
Actress: ఎక్స్ పీరియన్స్ ఉన్నా టెన్షన్ తప్పట్లేదంటున్న భామలు.. నయన్ నుంచి జాన్వీ వరకు..
చిన్నప్పటి నుంచీ నయన్‌కి షారుఖ్ అంటే చాలా ఇష్టం. అసలు బాలీవుడ్‌కే వెళ్లొద్దనుకున్న నయన్, షారుఖ్ సినిమా అనేసరికి కాదనలేకపోయారు. మామూలుగా ముంబైలో ప్రూవ్ చేసుకోవాలని మన బ్యూటీస్ తహతహలాడుతుంటారు. కానీ నయన్ కోసం నార్త్ జనాలు వెయిటింగ్. అంతటి వెల్కమింగ్ ఉన్నప్పటికీ టెన్షన్ ఫీలవుతున్నారు మిసెస్ తార. అయితే అదేం బయటకు కనిపించకుండా పిల్లలతో క్వాలిటీ టైమ్ కూడా స్పెండ్ చేస్తున్నారు.
Updated on: Aug 29, 2023 | 2:22 PM

ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్.. బుల్లెట్ దిగిందా? లేదా...? అప్పుడెప్పుడో మహేష్ చెప్పిన ఈ డైలాగ్‌ని ఆ నలుగురు బ్యూటీస్ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. ఎన్ని సినిమాలు చేసినా, ఎంత సక్సెస్ చూసినా, ఎంత ఫాలోయింగ్ ఉన్నా, మళ్లీ కొత్తగా మొదలుపెడుతుంటే, ఏదో తెలియని టెన్షన్ ఇబ్బందిపెడుతోందని అంటున్నారు. వెయిట్ చేస్తున్నకొద్దీ వారిలో ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఆ విషయమేంటి? ఇంతకీ ఎవరా భామలు... చూసేద్దాం రండి.

ఆ మధ్య ట్రిపుల్ ఆర్ సమయంలో ఆలియా ఎలాంటి టెన్షన్ ఫీలయ్యారో, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్‌గా అలాంటి పొజిషన్‌లోనే ఉన్నారు సౌత్ ఇండియన్ లేడీ సూపర్‌స్టార్ నయనతార. కమర్షియల్ సినిమాలు చేస్తూనే, ఫీమేల్ ఓరియంటెడ్ కంటెంట్‌కి పక్కా అడ్రస్‌గా మారిన నయనతార ఇప్పుడు ఓ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్‌లాగా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంత టెన్షన్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదంటున్నారు మేడమ్ నయన్.

చిన్నప్పటి నుంచీ నయన్‌కి షారుఖ్ అంటే చాలా ఇష్టం. అసలు బాలీవుడ్‌కే వెళ్లొద్దనుకున్న నయన్, షారుఖ్ సినిమా అనేసరికి కాదనలేకపోయారు. మామూలుగా ముంబైలో ప్రూవ్ చేసుకోవాలని మన బ్యూటీస్ తహతహలాడుతుంటారు. కానీ నయన్ కోసం నార్త్ జనాలు వెయిటింగ్. అంతటి వెల్కమింగ్ ఉన్నప్పటికీ టెన్షన్ ఫీలవుతున్నారు మిసెస్ తార. అయితే అదేం బయటకు కనిపించకుండా పిల్లలతో క్వాలిటీ టైమ్ కూడా స్పెండ్ చేస్తున్నారు. నయనతార కెరీర్ టెన్షన్ ఇప్పుడు ఎలా ఉందో తనకు తెలుసంటున్నారు దీపిక పదుకోన్.

డార్లింగ్ ప్రభాస్‌తో ఫస్ట్ టైమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు దీపిక పదుకోన్. నార్త్ ఇండియాలో అందరి మనసులు దోచుకున్న దీపిక, ఇప్పుడు డార్లింగ్ కల్కిని మాత్రం జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఇప్పుడు నయా సినీ కేపిటల్ హైదరాబాద్‌లో ప్రూవ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆమెకు చాలా బాగా తెలుసు. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

దీపిక ఫుట్ స్టెప్స్ నే ఫాలో అవుతున్నారు జాన్వీ కపూర్. తన అభిమాన హీరో తారక్‌తో కలిసి దేవరలో యాక్ట్ చేస్తున్నారు జాన్వీ. ఆ ఆనందం ఎంత ఉన్నప్పటికీ, తెలియని టెన్షన్ రన్ అవుతోందని అంటున్నారు అతిలోక సుందరి డాటర్.

నయన్, దీపిక, జాన్వీ ఉన్న క్లబ్‌లో నయా మెంబర్‌షిప్ తీసుకున్నారు కీర్తీ సురేష్. సౌత్‌లో మహానటిగా ప్రూవ్ చేసుకున్న కీర్తీ త్వరలోనే నార్త్ ఎంట్రీ ఇస్తున్నారు. అట్లీ నిర్మిస్తున్న సినిమాలో వరుణ్ ధావన్‌తో జోడీ కడుతున్నారు కీర్తీ సురేష్. నటిగా ఆల్రెడీ సెంట్ పర్సెంట్ మార్కులున్నప్పటికీ, ఉత్తరాదిన కొత్తగా మొదలుపెడుతుంటే, బెరుగ్గానే ఉందంటున్నారు కీర్తి.





























