ఆడియన్స్‌ను ఫిదా చేసేందుకు టాలీవుడ్ బాటలో కోలీవుడ్ మేకర్స్..
ఒక సినిమా హిట్ అయితే జస్ట్ ఆ సినిమాను మాత్రమే చూడాలనుకోవడం లేదు జనాలు. అంతకు మించి కావాలని కోరుకుంటున్నారు. ఆ అంతకు మించి ఎలా ఉంటుందో రాజమౌళి ఆల్రెడీ టేస్ట్ చూపించేశారు. రీసెంట్‌గా నాగ్ అశ్విన్ ఫాలో అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్ బాటలో కోలీవుడ్ మేకర్స్ కూడా అడుగులు వేస్తున్నారు. ఇంతకీ విషయమేంటో డీటైల్డ్ గా మాట్లాడుకుందాం... పదండి...
Updated on: Aug 17, 2024 | 7:10 PM

అప్పట్లో నిర్మాత అశ్వనీదత్ ఆల్రెడీ కొంత షూటింగ్ కూడా పూర్తయ్యిందని చెప్పారు. కానీ మిగతా పార్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్న విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

బాహుబలి కొట్టే హిట్ ఇవ్వటం రాజమౌళి, ప్రభాస్ వల్ల కూడా కాలేదు. మరి అప్ కమింగ్ సినిమాల్లో ఈ ఇద్దరిలో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసేదెవరు? ఆ ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది? ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలి ఓ టర్నింగ్ పాయింట్.

ఖాన్స్ కంటే ఎక్కువగా మన ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ సినిమాలు చూడ్డానికే నార్త్ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అక్కడి నటులు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ప్రభాస్ జోకర్ అంటూ అర్షద్ వార్షీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ రిలీజ్ అయి ఏడాది పూర్తయింది. రజనీకాంత్ ఏజ్‌కి తగ్గ కేరక్టర్‌ని భలే డిజైన్ చేశారు మేకర్స్. ఆఫ్టర్ జైలర్ రిలీజ్ సీనియర్ హీరోలకు ఎలాంటి కథలు రాయొచ్చో మిగిలిన మేకర్స్ కి కూడా ఓ అవగాహన వచ్చింది.

ఆ క్రేజ్ ఏడాది అయినా కంటిన్యూ అవుతోంది కాబట్టే, ఇప్పడు జైలర్ మేకింగ్ వీడియో సీరీస్‌లను విడుదల చేసింది టీమ్. జైలర్ అన్‌లాక్డ్ పేరుతో విడుదలైన వీడియోలకు నెట్టింట్లో యమా రెస్పాన్స్ వస్తోంది.




