Dhanush: ధనుష్ పెర్ఫామెన్స్ కు ఫిదా అయిన డైరెక్టర్
కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్న ధనుష్ బాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ధనుష్ బాలీవుడ్‌లో ఈ రేంజ్‌కు రావాడానికి మెయిన్ రీజన్ రణబీర్ కపూరే అంటున్నారు నార్త్ జనాలు. అదేంటి.. ధనుష్‌కి రణబీర్ ఎలా హెల్ప్ చేశారు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ. సౌత్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే రాంజాన సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు హీరో ధనుష్.
Updated on: Aug 17, 2024 | 6:57 PM

కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్న ధనుష్ బాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ధనుష్ బాలీవుడ్‌లో ఈ రేంజ్‌కు రావాడానికి మెయిన్ రీజన్ రణబీర్ కపూరే అంటున్నారు నార్త్ జనాలు. అదేంటి.. ధనుష్‌కి రణబీర్ ఎలా హెల్ప్ చేశారు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.

సౌత్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే రాంజాన సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు హీరో ధనుష్. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో సెటిల్ అయ్యారు ధనుష్.

అయితే రాంజాన సినిమాకు హీరోగా ఫస్ట్ ఛాయిస్ ధనుష్ కాదట. ముందు ఈ సినిమాను రణబీర్ కపూర్‌తో ప్లాన్ చేశారు డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్. కానీ అప్పట్లో రణబీర్ బిజీగా ఉండటంతో ఆయన డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో ఆ ఛాన్స్ ధనుష్‌కు వచ్చింది.

బాలీవుడ్‌లో తొలి సినిమానే అయినా రాంజానలో ధనుష్ పెర్ఫామెన్స్‌కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అదే సమయంలో దర్శకుడు ఆనంద్‌కు కూడా ధనుష్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే షమితాబ్‌లో బిగ్ బీ అమితాబ్‌తో పోటి పడి నటించే పాత్రలోనూ ధనుష్‌కే ఛాన్స్ ఇచ్చారు ఆనంద్ ఎల్ రాయ్.

ఒకవేళ రాంజాన సినిమాను రణబీరే చేసుంటే నార్త్‌లో ధనుష్ జర్నీ కాస్త ఆలస్యంగా మొదలై ఉండేది. షమితాబ్ లాంటి సినిమా ధనుష్ ఫిల్మోగ్రఫీలో మిస్ అయ్యుండేది. అందుకే డైరెక్ట్‌గా కాకపోయినా... ధనుష్ బాలీవుడ్ జర్నీకి రణబీర్ హెల్ప్ చేశారంటున్నారు నార్త్ జనాలు.




