- Telugu News Photo Gallery Cinema photos Know Super Star Krishna Film journey, his cinema records, telugu hit movies and filmography Telugu Hero Photos
Super Star Krishna: ఎనభై వసంతాల సాహసికి సెలవు.. తనదైన శైలితో వెండితెరపై చెరగని ముద్రవేసుకున్న బుర్రిపాలెం బుల్లోడు..!
తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మహారాజు కృష్ణ.దాదాపు 80 మల్టీస్టారర్స్‌లో నటించిన నటశేఖరుడు.కెరీర్ మొదట్నుంచి తోటి హీరోలతో స్క్రీన్ షేరింగ్
Updated on: Nov 16, 2022 | 6:58 PM

వయసును జయించిన అసాధ్యుడికి ఇక సెలవు.తెలుగు గుండెలకు తన నటనతో పరిమళాలు అద్దిన బుర్రిపాలెం బుల్లోడు..!తెలుగు చిత్ర సీమకు తన సాహసాలతో నూతనోత్సాహాన్ని అందించిన జేమ్స్‌బాండ్..!

ఆనాటి తేనె మనసులు నుంచి.. సాక్షి, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, జేమ్స్‌బాండ్ 777, సింహాసనం, బంగారు కుటుంబం, ఈనాడు, వజ్రాయుధం, నంబర్‌వన్..ఇలా

అర్ద శతాబ్దంపాటు వెండితెరను వెలిగించిన ఎవర్‌గ్రీన్ హీరో.. మన సూపర్‌స్టార్ కృష్ణ! ఆయన నటన నేర్చిన హీరో మాత్రమేకాదు..ఆడియన్స్‌ని మంత్రముగ్ధుల్ని చేసే మాంత్రికుడు కూడా!

చూపులతో అందాన్ని తడమడం..కళ్లతోనే భావాలు పలికించడం కృష్ణకు తెలుసు! ఆయనతో నటించడానికి తపించని హీరోయిన్ లేదంటే అతిశయోక్తి లేదు. ఆ మాట వేరు. ఆ చూపు వేరు. ఆ జోరు వేరు. ఆ స్టైల్ వేరు.

అందుకే కృష్ణకు పర్యాయపదం..కృష్ణే! లెక్కకు అందనన్ని సినిమాలు..! ఎన్నో శత దినోత్సవాలు జరుపుకొన్న అద్భుతం! విభిన్న తరహా పాత్రల్లో రాణించిన నట శేఖరుడు..మన సూపర్‌స్టార్ కృష్ణ!

పౌరాణికం, జానపదం, సాంఘికం..సినిమా ఏదైనా..సాహసమే ఆయన ఊపిరి. తెలుగు తెరకు ఎన్నో టెక్నాలజీ సొబగులు అద్దిన ఆయన దార్శనికత అనన్య సామాన్యం!

తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మహారాజు కృష్ణ.దాదాపు 80 మల్టీస్టారర్స్‌లో నటించిన నటశేఖరుడు.కెరీర్ మొదట్నుంచి తోటి హీరోలతో స్క్రీన్ షేరింగ్..

సినీ ఇండస్ట్రీ లోనే కృష్ణ చేసినన్ని ప్రయోగాత్మక చిత్రాలు ఏ హీరోలు చెయ్యలేదు అంటే ఆసియాయోక్తి లేదు..

సూపర్ స్టార్ కృష్ణ విభిన్న పాత్రలను కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసారు..

సూపర్ స్టార్ కృష్ణ విభిన్న పాత్రలను కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసారు..

అనితర సాధ్యమైన విజయాలను అందుకున్న ఆ నిత్య సాహసికి టీవీ9 కన్నీటి నివాళి అర్పిస్తోంది.




