- Telugu News Photo Gallery Cinema photos Know how much time it took for Devi Sri Prasad for Arya Movie aa ante amalapuram song tune
Arya: అ అంటే అమలాపురం ట్యూన్‌కి ఎన్నాళ్లు పట్టిందో తెలుసా ??
అ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అనే పాట గుర్తుందా? గుర్తుండటమేంటి? ఆ పాట రిలీజ్ అయినప్పుడు ఎక్కడ విన్నా అదే హోరు అని అంటున్నారా? నిజమే. అప్పట్లో అంతలా హిట్ అయింది ఆ పాట. అదే ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే, ఎన్ని మిలియన్లు దాటేసి చార్ట్ బస్టర్‌గా నిలిచేదో! అంతలా కుర్రకారు మనసులు దోచిన ఆ పాట కోసం మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎంత టైమ్ తీసుకున్నారో తెలుసా? ఆ పాటను ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు చెప్పి ఓకే చేయించుకోవడానికి ఎన్నాళ్లు పట్టిందో తెలుసా? అ అంటే అమలాపురం పాట గురించి ఈ మధ్యనే ఇంట్రస్టింగ్ డీటైల్స్ రివీల్ చేశారు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన మాట్లాడుతూ ''అ అంటే అమలాపురం పాట ఏ సీక్వెన్స్ లో వస్తుందో చెప్పారు డైరక్టర్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Nov 02, 2023 | 6:58 PM

అ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం అనే పాట గుర్తుందా? గుర్తుండటమేంటి? ఆ పాట రిలీజ్ అయినప్పుడు ఎక్కడ విన్నా అదే హోరు అని అంటున్నారా? నిజమే. అప్పట్లో అంతలా హిట్ అయింది ఆ పాట.

అదే ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే, ఎన్ని మిలియన్లు దాటేసి చార్ట్ బస్టర్‌గా నిలిచేదో! అంతలా కుర్రకారు మనసులు దోచిన ఆ పాట కోసం మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎంత టైమ్ తీసుకున్నారో తెలుసా? ఆ పాటను ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు చెప్పి ఓకే చేయించుకోవడానికి ఎన్నాళ్లు పట్టిందో తెలుసా?

అ అంటే అమలాపురం పాట గురించి ఈ మధ్యనే ఇంట్రస్టింగ్ డీటైల్స్ రివీల్ చేశారు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆయన మాట్లాడుతూ ''అ అంటే అమలాపురం పాట ఏ సీక్వెన్స్ లో వస్తుందో చెప్పారు డైరక్టర్. ఎలా ఉండాలో క్లారిటీ ఉంది నాకు. అయితే ఆ పాటను మామూలుగా కంపోజ్ చేయాలనిపించలేదు. సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్టు చేయాలని ఫిక్స్ అయ్యాను.

ఎవ్వరు విన్నా ఫ్రెష్‌గా ఫీలవ్వాలి. ఔట్ ఆఫ్ ది బాక్స్ మ్యూజిక్ అనాలని నాకు నేనే టార్గెట్ పెట్టుకున్నా. రోజు గడిచింది. రెండు రోజులయ్యాయి. మూడు రోజులయ్యాయి. అయినా ఏం తట్టలేదు. సరేనని పడుకుని నిద్రపోయా. నేను నిద్రపోయానని అనుకున్నాను కానీ, సగం సగమే కునుకుపట్టింది. ఉన్నట్టుండి నాకో ఐడియా వచ్చింది. దాన్నిబట్టి నేను నిద్రపోయాను కానీ, నా మనసులో ఆ పాటే తిరుగుతుందని అనిపించింది.

ఐడియా రాగానే వెంటనే లేచి ప్రొడ్యూసర్ దిల్‌రాజుగారికి ఫోన్ చేశాను. ఆయన వేరే ప్లేస్‌లో ఉన్నారు. నా దగ్గరకు రావడానికి 20 నిమిషాలు పడుతుందని అన్నారు. ఆయన వచ్చేలోపే నా ట్యూన్ రెడీ అయింది. దీన్ని బట్టి... ట్యూన్లు అప్పుడే చేయగలం, ఇప్పుడే చేయలేం అనేదేమీ ఉండదు అనేది నాకు మరోసారి అర్థమైంది.

మన మనసుకు నచ్చిన ట్యూన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిగ్గా అవి ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతాయని ప్రూవ్ అయింది'' అని అన్నారు. రీసెంట్‌గా పుష్ప సినిమాలో బాణీలకుగానూ నేషనల్ అవార్డు అందుకున్నారు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.





























