Trisha Krishnan: కాలం ఆమెను చూసి ఆగిపోయినట్లుంది.. అందుకే రోజు రోజుకీ వయసు మరింత తగ్గుతోంది..
త్రిష క్రిష్ణన్.. ఇప్పుడు మళ్లీ ఫాంలోకి వచ్చింది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో మళ్లీ బిజీ హీరోయిన్ అయిపోయింది. అటు కొత్త హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. యువరాణి కుందవై పాత్రలో మైమరపించిన త్రిష.. ఈ మూవీ ప్రమోషన్లలో మరింత అందంగా కనిపించి మంత్రముగ్దులను చేసింది. దీంతో ఈ అమ్మడుకు తమిళంలో ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే దళపతి విజయ్ నటించిన లియో చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇందులో మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకుంది.