ప్రస్తుతం చేతిలో ఒక్క సినిమా లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. తన కూతురితో ఎంజాయ్ చేస్తున్న క్షణాలను నెట్టింట అభిమానులతో పంచుకుంటుంది. అలాగే లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ మన సంప్రదాయలకు ఎంతగా విలువ ఇస్తుందో చెప్పక్కర్లేదు. తాజాగా పట్టుచీరలో మరింత అందంగా ముస్తాబయ్యింది ప్రణీత. పసుపు రంగు పట్టుచీరలో బంగారు ఆభరణాలు ధరించి అచ్చం మహాలక్ష్మిగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా..