- Telugu News Photo Gallery Cinema photos KGF Fame Rocking Star Yash heroine shanvi srivastava shares bold photos on instagram viral in social media
Tollywood: కళ్లతోనే కవ్విస్తోన్న ఈ నెరజాణ ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే..
శాన్వి శ్రీవాత్సవ.. ఈ హీరోయిన్ గురించి తెలుగు ఫ్యాన్స్ కంటే కన్నడ ప్రేక్షకులే ఎక్కువగా తెలుసని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో ఈమె చేసింది కేవలం 4 చిత్రాలే..
Updated on: Feb 23, 2023 | 6:40 AM

శాన్వి శ్రీవాత్సవ.. ఈ హీరోయిన్ గురించి తెలుగు ఫ్యాన్స్ కంటే కన్నడ ప్రేక్షకులే ఎక్కువగా తెలుసని చెప్పొచ్చు.

టాలీవుడ్‌లో ఈమె చేసింది కేవలం 4 చిత్రాలే.. అవి కూడా పెద్దగా విజయం సాధించలేదు. అయితేనేం కన్నడంలో మాత్రం శాన్వి స్టార్ హీరోయిన్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంది.

ఇటీవల శాన్వి ఇండోనేషియాలోని బాలికి టూర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె తీసిన బోల్డ్ ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు శాన్వి 2012లో తెలుగులో ‘లవ్లీ’ చిత్రంతో అరంగేట్రం చేయగా.. 2014లో ‘చంద్రలేఖ’ అనే కన్నడ సినిమాతో ఆ ఇండస్ట్రీలోకి పరిచయమైంది. ఆ తర్వాత 2015లో కేజీఎఫ్ ఫేం యష్‌తో కలిసి ‘మాస్టర్‌పీస్’ చిత్రంలో నటించింది.

'మాస్టర్ పీస్' సూపర్ హిట్ కావడంతో.. శాన్వికి కన్నడంలో వరుసగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఆమె రెండు కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

కాగా, ఆమె తెలుగులో 'లవ్లీ', 'అడ్డా', 'ప్యార్ మే పడిపోయానే', 'రౌడీ' సినిమాల్లో నటించింది. శాన్విని ఇన్‌స్టాగ్రామ్‌లో 13 లక్షల మంది ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.




