- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh Will Play Another Challenging Role In Vijay Deverakonda Rowdy Janardan Movie
Keerthy Suresh: రిస్క్ చేస్తున్న మహానటి.. ఆ స్టార్ హీరో సినిమాలో కీర్తి సురేశ్ ఛాలెంజింగ్ రోల్..
అందం, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది.
Updated on: Jul 21, 2025 | 2:02 PM

2016లో నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళీ కుట్టి కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇందులో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది.

ఆ తర్వాత నేను లోకల్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, సర్కారు వారి పాట, రంగ్ దే వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో సహజ నటనతో కట్టిపడేస్తుంది కీర్తి. ఇటీవలే ఉప్పు కప్పురంబు సినిమాతో హిట్టు అందుకుంది.

ఇదిలా ఉంటే.. గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్.. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీగా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు వైవిధ్యమైన పాత్రలతో అలరించిన కీర్తి సురేష్.. ఈసారి రిస్క్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కింగ్ డమ్ మూవీలో నటిస్తున్న విజయ్ దేవరకొండ త్వరలోనే రౌడీ జనార్థన్ సినిమాను స్టార్ట్ చేయనున్నారు. ఇందులో కథానాయికగా కీర్తిని ఎంపిక చేసినట్లుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా ఈ మూవీలో కీర్తి పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం కీర్తి సురేష్ ఇందులో వేశ్య పాత్రలో నటించనుందని టాక్. ఇప్పటివరకు ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన కీర్తి సురేష్..ఈ తరహా పాత్ర చేయలేదు. ఇక ఇప్పుడు మరోసారి ఛాలెంజింగ్ రోల్ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం.




