- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh missed out on the blockbuster Chhaava for Baby John
Keerthy Suresh: బ్యాడ్ లక్ సఖి..! డిజాస్టర్ సినిమా కోసం బ్లాక్ బస్టర్ మూవీ వదులుకుంది..
హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడున్న యంగ్ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా అరడజను సినిమాలను లైనప్ చేస్తున్నారు. వారిలో కీర్తిసురేష్ ఒకరు.
Updated on: Jul 30, 2025 | 9:39 PM

హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడున్న యంగ్ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా అరడజను సినిమాలను లైనప్ చేస్తున్నారు. వారిలో కీర్తిసురేష్ ఒకరు.

డేట్స్ అడ్జెస్ట్ అవ్వక చాలా మంది హీరోయిన్ కొన్ని భారీ హిట్ సినిమాలను వదులుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా భారీ బడ్జెట్ సినిమాను మిస్ చేసుకుంది ఈ వయ్యారి. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తుంది.

తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది ఆతర్వాత మహానటి సినిమాతో పాపులర్ య్యింది. ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లోనూ సినిమా చేసింది కీర్తి.

బేబీ జాన్ అనే సినిమాతో అక్కడ పరిచయం అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా కోసం కీర్తి ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇటీవల ఛావా సినిమా విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దేహవ్యాప్తంగా ఛావా సినిమా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేసింది. అయితే ముందుగా హీరోయిన్ పాత్ర కోసం కీర్తిసురేష్ ను సంప్రదించారట. అయితే ఆ సమయంలో బేబీ జాన్ సినిమాతో బిజీగా ఉండటంతో ఆమె నో చెప్పిందని తెలుస్తుంది.