- Telugu News Photo Gallery Cinema photos Karnataka Ratna Awards 2022 Photos Karnataka Ratna Prashasthi to Puneeth Rajkumar with Chief Guests Rajinikanth, Jr. NTR Telugu cinima photos
Puneeth raj kumar: ‘కర్ణాటక రత్న’తో దివంగత పునీత్ రాజ్‌కుమార్‌కు సత్కారం.. ముఖ్య అతిధులుగా ఎన్టీఆర్, రజినీకాంత్..(ఫొటోస్)
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.గతేడాది అక్టోబర్29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి.
Updated on: Nov 02, 2022 | 9:30 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.గతేడాది అక్టోబర్29న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

అయితే అతని జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉన్నాయి. కన్నడ సూపర్ స్టార్ దివంగత రాజ్‌కుమార్ చిన్న కుమారుడు పునీత్ రాజ్ కుమార్. బాలనటుడి గా అనేక సినిమాల్లో నటించిన పునీత్..

అప్పు సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు.

పునీత్ కు తెలుగునాట అశేష అభిమానగణం ఉంది. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.

పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తాయారు చేశారు. ఈ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.

ఈ సందర్భంగా తారక్ కన్నడ భాషలో మాట్లాడు ఆకట్టుకున్నారు. అద్భుతంగా ఎక్కడా తడబడకుండా కన్నడలో మాట్లాడి అక్కడున్న వారి చేత చప్పట్లు కొట్టించుకున్నారు యంగ్ టైగర్. పునీత్ నవ్వులో ఉండే స్వచ్చత మరెక్కడా చూడలేదు.

అహం అహంకారాన్ని పక్కన పెట్టి యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని జయించిన వ్యక్తి పునీత్. సూపర్ స్టార్ గా.. భర్తగా.. తండ్రిగా.. స్నేహితుడిగా తనదైన ముద్ర వేశారు అంటూ

పునీత్ పై తన ప్రేమను కురిపించారు తారక్. దాంతో పునీత్ ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇక పునీత్ కు తారక్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉన్న విషయం తెలిసిందే.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు. స్వీకరించిన పునీత్ భార్య.. ముఖ్యఅతిథులుగా జూ.ఎన్టీఆర్ మరియు సూపర్ స్టార్ రజినీకాంత్.. (ఫొటోస్)




