తృటిలో తప్పిన ప్రమాదం.. అయిన తగ్గేదేలే.. ప్రాణాలకు తెగిస్తానంటున్న రిషబ్ శెట్టి..
కాంతార సెట్లో ప్రమాదం, కాంతార యూనిట్ మెంబర్ ఇకలేరు. తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్న కాంతర టీమ్, హీరో కూడా నేరో ఎస్కేప్ అయ్యారట... ఈ మధ్య కాలంలో మరే మూవీ విషయంలోనూ ఇన్ని సార్లు వినిపించని మాటలు ఇవి... అసలేం జరుగుతోంది. రిస్క్ చేయడమంటే నాకు రస్క్ తిన్నంత ఈజీ అనే ధోరణి కనిపిస్తోంది కాంతార కెప్టెన్ రిషబ్ శెట్టిలో.
Updated on: Jun 17, 2025 | 7:51 PM

కాంతార సెట్లో ప్రమాదం, కాంతార యూనిట్ మెంబర్ ఇకలేరు. తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్న కాంతర టీమ్, హీరో కూడా నేరో ఎస్కేప్ అయ్యారట... ఈ మధ్య కాలంలో మరే మూవీ విషయంలోనూ ఇన్ని సార్లు వినిపించని మాటలు ఇవి... అసలేం జరుగుతోంది.

రిస్క్ చేయడమంటే నాకు రస్క్ తిన్నంత ఈజీ అనే ధోరణి కనిపిస్తోంది కాంతార కెప్టెన్ రిషబ్ శెట్టిలో. ప్యాషన్ ఉండాల్సిందేగానీ, ప్రాణాలను పణంగా పెట్టి అంత చేయడం అవసరమా అనే సలహాలు వినిపిస్తున్నాయి నియర్ అండ్ డియర్స్ నుంచి.

కాంతార ఫస్ట్ పార్టునే ఆస్కార్‌కి పంపించాలనుకున్నాం. కానీ కుదరలేదు. సెకండ్ పార్టుని కచ్చితంగా పంపిస్తాం. గెలుచుకుని వస్తాం అనే కాన్ఫిడెన్స్ తో పనిచేస్తోంది టీమ్. అందుకు తగ్గట్టు అన్ని విధాలా కష్టపడుతోంది. కొన్నిసార్లు యూనిట్ చేసే సాహసం నెటిజన్లకు ఆందోళన కలిగిస్తోంది.

రిషబ్‌శెట్టితో పాటు 30 మంది ట్రావెల్ చేసిన బోట్ కర్ణాటకలోని మణి రిజర్వాయర్‌లో బోల్తా పడింది. పెను ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం కాలేదు. కానీ, కెమెరాలతో పాటు కాస్ట్లీ ఎక్విప్‌మెంట్ మాత్రం కొట్టుకుపోయిందట.

అక్టోబర్ 2న రిలీజ్ కానుంది కాంతార చాప్టర్ 1. సినిమా పోస్ట్ పోన్ అవుతుందని పలుమార్లు పుకార్లు వినిపించినా, అందులో నిజం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు మేకర్స్. మాట తప్పను.. మడం తిప్పను కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్నారు రిషబ్.




