- Telugu News Photo Gallery Cinema photos Kamal Haasan in super form, movie makers are happy even if he appears in the movie
Kamal Haasan: సూపర్ ఫామ్‌లో కమల్ హాసన్.. సినిమాలో కనిపిస్తే చాలంటున్న మేకర్స్
ఆ మధ్య వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో పడ్డ కమల్ హాసన్ ఇప్పుడు సూపర్ ఫామ్‌లోకి వచ్చారు. విక్రమ్ సక్సెస్‌తో మరోసారి కెరీర్‌లో పీక్స్ చూస్తున్నారు కమల్ హాసన్. అయితే కమల్ హీరోగా వరుస సినిమాలు వస్తున్నా,... ఆ సినిమాల్లో ఆయన స్క్రీన్ టైమ్ మాత్రం అభిమానులను నిరాశపరుస్తోంది. విక్రమ్ సినిమాలో కమల్ హాసనే హీరో. సినిమా అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంది. కానీ ఈ సినిమాలో ఆయన స్క్రీన్ టైమ్ చాలా తక్కువ.
Updated on: Jul 09, 2024 | 7:35 PM

ఆ మధ్య వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో పడ్డ కమల్ హాసన్ ఇప్పుడు సూపర్ ఫామ్‌లోకి వచ్చారు. విక్రమ్ సక్సెస్‌తో మరోసారి కెరీర్‌లో పీక్స్ చూస్తున్నారు కమల్ హాసన్. అయితే కమల్ హీరోగా వరుస సినిమాలు వస్తున్నా,... ఆ సినిమాల్లో ఆయన స్క్రీన్ టైమ్ మాత్రం అభిమానులను నిరాశపరుస్తోంది.

విక్రమ్ సినిమాలో కమల్ హాసనే హీరో. సినిమా అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంది. కానీ ఈ సినిమాలో ఆయన స్క్రీన్ టైమ్ చాలా తక్కువ. ఇక డైలాగులైతే వేళ్ల మీద లెక్క పెట్టే అన్నే. అయినా విక్రమ్ సక్సెస్ కమల్ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది. అభిమానుల్లో కొత్త జోష్ తీసుకువచ్చింది.

విక్రమ్ తరువాత స్పీడు పెంచిన కమల్ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడీలో విలన్‌గా నటించారు. ఈ సినిమాలో కేవలం రెండు సీన్స్‌లో మాత్రమే కనిపించినా కమల్ ఇమేజ్ సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది. ఇప్పుడు భారతీయుడు 2 విషయంలోనూ అదే జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది.

భారతీయుడు 2లో కమల్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కమల్, సోషల్ మీడియా వార్తలపై క్లారిటీ ఇవ్వకపోయినా... అసలు నటుల స్క్రీన్ టైమ్ అన్నది డిస్కషన్ పాయింటే కాదన్నారు.

ప్రజెంట్ కెరీర్ పరంగా మరోసారి మంచి ఫామ్‌లో ఉన్నారు లోకనాయకుడు. వరుస సినిమాలు చేస్తూ యంగ్ జనరేషన్‌కు కూడా పోటి ఇస్తున్నారు. ఈ టైమ్‌లో ప్రతీ సినిమాలోనూ కమల్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండటం విషయంలో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.




