కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇండియన్ 2. తెలుగులో భారతీయుడు 2గా వస్తుంది ఈ చిత్రం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఐపిఎల్‌ను వాడుకుంటున్నారు దర్శక నిర్మాతలు. కమల్ హాసన్, శంకర్ ఐపిఎల్‌లో తమ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు.