AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara 2: దేవర -2 షూటింగ్‌పై మేజర్ అప్‌డేట్.. సెట్స్ పైకి వచ్చేది అప్పుడేనట

ఎంతసేపూ వార్ 2, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు గానీ.. ఎన్టీఆర్ దేవర 2 సినిమా బాకీ ఉన్నారని గుర్తుందా..? మిగిలిన సినిమాల ధ్యాసలో పడి ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా చర్చ జరగట్లేదు ఈ మధ్య. కానీ దీన్ని ఎవరూ ఊహించని స్థాయిలో డిజైన్ చేస్తున్నారు కొరటాల. తాజాగా దేవర 2 అప్‌డేట్స్ వచ్చాయి. మరి అవేంటి..? అసలు దేవర 2 సెట్స్‌పైకి వచ్చేదెప్పుడు..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Mar 08, 2025 | 12:36 PM

Share
అరవింద సమేత, దేవరకి మధ్య సోలో హీరోగా సినిమా చేయడానికి ఆరేళ్లు తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. మధ్యలో ట్రిపుల్ ఆర్ వచ్చినా.. అది మల్టీస్టారర్. తెలిసో తెలియకో అంత గ్యాప్ వచ్చింది.. అందుకే ఇకపై సినిమా సినిమాకు అస్సలు గ్యాప్ ఉండకూడదని ఫిక్సయ్యారు తారక్.

1 / 5
అందుకే ఏడాదికి ఒకటి.. కుదిర్తే రెండూ అనే పద్దతిలో అలా వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం వార్ 2 సెట్స్‌లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ముంబైలోని యశ్‌రాజ్ స్టూడియోస్‌లో ఓ క్రేజీ సాంగ్‌ను హృతిక్, తారక్‌పై చిత్రీకరిస్తున్నారు దర్శకుడు అయన్ ముఖర్జీ.

2 / 5
మార్చిలోనే వార్ 2 షూట్ పూర్తి చేసి.. ప్రశాంత్ నీల్ డ్రాగన్ సెట్స్‌లో జాయిన్ కానున్నారు ఎన్టీఆర్. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది.. హీరో లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు నీల్. డ్రాగన్ షూటింగ్ నవంబర్ నాటికి పూర్తి కానుంది. సంక్రాంతి 2026కి దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్.

3 / 5
మరోవైపు దేవర 2 స్క్రిప్ట్ పనులు ఈ మధ్యే మొదలుపెట్టారు కొరటాల శివ. మే నాటికి కథ పూర్తి చేసి.. 2025 సెకండాఫ్ అంతా ప్రీ ప్రొడక్షన్‌పైనే ఫోకస్ చేయనున్నారు ఈ దర్శకుడు. ఈలోపు డ్రాగన్ పూర్తి చేయనున్నారు తారక్.

4 / 5
డిసెంబర్ నాటికి దేవర 2 ప్రీ ప్రొడక్షన్ పూర్తైతే.. 2026 ఫస్టాఫ్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లి దసరాకి రిలీజ్ చేయాలనేది కొరటాల ప్లాన్. పైగా తారక్ కూడా ఓ సినిమా అయ్యాకే.. మరోటి అంటున్నారు. అంటే 2026 సంక్రాంతికి డ్రాగన్.. దసరాకు దేవర 2తో రావడం దాదాపు ఖాయం. 2010లోనూ సంక్రాంతికి అదుర్స్.. దసరాకు బృందావనంతో వచ్చి హిట్ కొట్టారు తారక్.

5 / 5