- Telugu News Photo Gallery Cinema photos Interestng Facts Of CM Devendra Fadnavis wife Amruta Fadnavis, See her Photos
Bollywood: ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ .. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తోంది.. ఫొటోస్ ఇదిగో
ఆరేళ్ల వయస్సులోనే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది. సోషియల్ యాక్టివిస్ట్‌గానూ, సింగర్‌గా రాణించింది. ఇక భర్తది రాజకీయ నేపథ్యం కావడంతో ఆయన వెంటే ఉండి ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం కూడా నిర్వహించింది.
Updated on: Dec 06, 2024 | 11:02 PM

ఇటీవల మహరాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన మహరాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ప్రమాణ స్వీకారోత్సవం కూడా పూర్తైపోయింది.

కాగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన భార్య అమృతా ఫడ్నవీస్ కూడా హాజరైంది. అమృత విషయానికి వస్తే.. నాగ్‌పూర్‌లో పుట్టి పెరిగిన ఆమె ఆరేళ్ల వయస్సులోనే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది.

అయితే అమృత మొదట బ్యాంక్ ఉద్యోగంతో తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సోషియల్ యాక్టివిస్ట్‌గా, సింగర్‌గానూ రాణించింది. మొదటిసారి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన జై గంగాజల్ మూవీలో ఒక పాటను పాడింది.

అమృత మొదటి మ్యూజిక్ వీడియో ఫిర్ సేకు ఏకంగా మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. వీటితో పాటు ముంబయి రివర్ యాంథెమ్, ముంబై-పోయిసర్, దహిసర్, ఓషివారా, మిథి అనే పాటలు కూడా పాడింది అమృత.




