- Telugu News Photo Gallery Cinema photos Hollywood heroines like Rashmika Mandanna Pooja Hegde Lavanya Tripathi interested to do lady oriented films
రూటు మారుస్తున్న అందాల భామలు.. అలాంటి కథలకే ఓకే స్టార్ హీరోయిన్స్
కమర్షియల్ హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్న అందాల భామలు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి, ఇక నటిగా పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అవుతున్నారు. అందుకే విమెన్ సెంట్రిక్ కథలకు వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న.
Updated on: Dec 16, 2024 | 9:33 PM

కమర్షియల్ హీరోయిన్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్న అందాల భామలు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి, ఇక నటిగా పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అవుతున్నారు. అందుకే విమెన్ సెంట్రిక్ కథలకు వెంటనే ఓకే చెప్పేస్తున్నారు.

భాయ్‌జాన్ సినిమాలు చూస్తూ పెరిగిన ఈ బ్యూటీ, ఇప్పుడు ఆయన సినిమాలో నటించే ఛాన్స్ రావటంతో స్కై హైలో తేలిపోతున్నారు.

డిఫరెంట్ మూవీస్‌తో లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ కూడా లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కథ నచ్చి ఆ సినిమాను స్వయంగా ప్రజెంట్ చేస్తున్నారు సంయుక్త.

తాజాగా లావణ్య త్రిపాఠి కూడా ఈ లిస్ట్‌లో చేరారు. తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సతీ లీలావతి సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు లావణ్య. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ రివీల్ చేశారు మేకర్రస్.

వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న పూజా హెగ్డే కూడా 2025లో సోలో హిట్ మీద కన్నేశారు. తమిళ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు కెప్టెన్సీలో లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు జిగేల్ రాణి.




