- Telugu News Photo Gallery Cinema photos Hollywood Actor Michael Gambon, Dumbledore in the 'Harry Potter' Films, Dies at 82
Michael Gambon: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘హ్యారీ పోటర్’ నటుడు మైఖేల్ గాంబోన్ కన్నుమూత..
హ్యారీపోటర్ సిరీస్‌తో సహా పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన నటుడు మైఖేల్ గాంబోన్ కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. మైఖేల్ వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో గతకొంతకాలంగా భాదపడుతున్నారు. ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌లో మైఖేల్ న్యుమోనియాతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మైఖేల్ 1940లో ఐర్లాండ్‌లో జన్మించాడు. అతని తండ్రి రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత ఆయన లండన్ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. అదే సమయంలో మైఖేల్ గాంబోన్‌ను లండన్‌కు తీసుకువచ్చాడు.
Updated on: Sep 29, 2023 | 10:07 AM

హ్యారీపోటర్ సిరీస్‌తో సహా పలు హాలీవుడ్ సినిమాల్లో నటించిన నటుడు మైఖేల్ గాంబోన్ కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్లు. మైఖేల్ వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో గతకొంతకాలంగా భాదపడుతున్నారు. ఇంగ్లండ్‌లోని ఎసెక్స్‌లో మైఖేల్ న్యుమోనియాతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మైఖేల్ 1940లో ఐర్లాండ్‌లో జన్మించాడు. అతని తండ్రి రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. తరువాత ఆయన లండన్ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. అదే సమయంలో మైఖేల్ గాంబోన్‌ను లండన్‌కు తీసుకువచ్చాడు. 1962లో నాటకాల్లో నటించడం ప్రారంభించిన గాంబోన్ అనేక నాటకాల్లో నటించాడు. సినీ నటుడిగా మారిన తర్వాత కూడా గాంబోన్ పలు నాటకాల్లో నటించాడు.

1965లో, గాంబోన్ తన మొదటి చిత్రంలో నటించాడు. ఆయన నటించిన తొలి నాటకం 'ఒథెల్లో' సినిమాగా తీయగానే అందులో పాత్ర లభించింది. మొదటి సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకున్న గాంబోన్ ఆ తర్వాత పలు పాపులర్ సినిమాల్లో నటించాడు. గాంబోన్ అనేక హారర్ అలాగే యాక్షన్ సినిమాలలో నటించాడు.

గాంబోన్ మొదటిసారి 2004లో హ్యారీ పోటర్‌లో కనిపించాడు. ప్రొఫెసర్ ఆల్బన్ డంబుల్‌డోర్‌గా అతని పాత్ర చాలా ప్రశంసించబడింది. 2004 నుండి 2011 వరకు, గాంబోన్ ఆరు హ్యారీ పోటర్ చిత్రాలలో ప్రొఫెసర్ ఆల్బన్ డంబుల్‌డోర్‌గా నటించాడు.

హ్యారీపోటర్‌తో పాటు, ఆస్కార్ విన్నర్ 'కింగ్స్ స్పీచ్', ప్రముఖ యాక్షన్ మూవీస్ 'కింగ్స్‌మెన్', కామెడీ మూవీ 'జానీ ఇంగ్లీష్' వంటి అనేక ఇతర సినిమాల్లో ఆయన నటించారు. గాంబోన్ చివరిగా 2019లో 'జూడీ', 'కోర్డెలియా' సినిమాల్లో నటించారు. గాంబోన్ మృతి పట్ల పలువురు హాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.




