- Telugu News Photo Gallery Cinema photos Heroines who turned as Producers for some movies in Film Industry Telugu Actress Photos
Lady producers: ఇండస్ట్రీలో పెరిగిపోతున్న లేడీ ప్రొడ్యూసర్స్.! సేఫ్ సైడ్ బానే సెట్.
ఇండస్ట్రీని ఇప్పుడు కాస్త నిశితంగా పరిశీలించిన వారికి ఎవరికైనా సరే, ఓ విషయం తప్పక బోధపడుతుంది. బోలెడన్ని విషయాలుంటాయీ.. ఇంతకీ మీరు చెబుతున్నది దేని గురించీ.. అని అంటారా? లేడీస్ స్పెషల్ గురించి! అదేనండీ. ఓ వైపు నటీమణులుగా కొనసాగుతూ, ఇంకో వైపు నిర్మాణ సంస్థలను పెట్టి సినిమాలు నిర్మిస్తున్న వారి గురించి.. నార్త్ టు సౌత్ ఈ కౌంట్ కాస్త మెండుగానే కనిపిస్తోందండోయ్..
Updated on: Apr 04, 2024 | 9:50 PM

ఇండస్ట్రీని ఇప్పుడు కాస్త నిశితంగా పరిశీలించిన వారికి ఎవరికైనా సరే, ఓ విషయం తప్పక బోధపడుతుంది. బోలెడన్ని విషయాలుంటాయీ.. ఇంతకీ మీరు చెబుతున్నది దేని గురించీ... అని అంటారా? లేడీస్ స్పెషల్ గురించి! అదేనండీ.

ప్రముఖ విద్వాంసురాలి చరిత్రను తరతరాలు గుర్తుపెట్టుకునేలా భారీ వ్యయంతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సిల్వర్‌స్క్రీన్స్ మీదకు తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్.

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ఛార్మి. పూరి జగన్నాథ్‌తో కలిసి ఆమె ఈ మధ్య వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బంపర్ హిట్ కూడా అందుకున్నారు. ఆ తర్వాత లైగర్ తీశారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ కూడా ఛార్మీ ఖాతాలోదే.

చదువు విషయంలో ఎప్పుడూ ముందు ఉంటారు లక్ష్మీ మంచు.. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకోసం తనవంతు సాయం చేస్తూ ఉన్నారు. ఏ మాత్రం సమయం దొరికిన పేద పిల్లలకి ఇంగ్లీష్ , లీడర్ షిప్ స్కిల్స్ నేర్పిస్తున్నారు. తన పరిచయస్తులతోను ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు లక్ష్మీ మంచు.

డబ్బు అవసరమే కానీ, అంతకన్నా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. నాకున్న 24 గంటలనీ ఆలోచించి ప్లాన్ చేసుకుంటాను అని అంటున్నారు నయన్. ఏ విషయాన్నైనా సరే స్టేట్ మెంట్లు ఇచ్చి.. చాటింపేయడం నయనతారకి అసలు అలవాటు లేదు. ఆమెకి తెలిసిందంతా ఒక్కటే... ఆచరించి చూపించేయడం.

ఇండస్ట్రీలో స్ట్రాంగ్ లేడీస్‌గా పేరు తెచ్చుకున్న కంగన రనౌత్‌కి ఓన్ బ్యానర్ ఉంది. అమలాపాల్ కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

ఇటు అవికా గోర్, నిత్యామీనన్, కృతి సనన్ కూడా ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. రెండు పడవల మీద ప్రయాణం కష్టమే. కానీ, ప్యాషన్‌తో పనిచేస్తే అలుపూ సొలుపూ ఉండదని అంటున్నారు ఈ నాయికలు.




