- Telugu News Photo Gallery Cinema photos Huge Demand For Agent Movies From Bollywood To Tollywood Telugu Heroes Photos
Agent Movies: సిల్వర్ స్క్రీన్ మీద పెరుగుతున్న ఏజెంట్లు.! హీరోయిన్స్ కూడా..
సిల్వర్‌స్క్రీన్ మీద ఏజెంట్స్ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మేల్, ఫీమేల్ అనే జెండర్ తేడా అక్కడ కనిపించడం లేదు. హీరోలకు ధీటుగా హీరోయిన్లు కూడా ఏజెంట్లుగా మెప్పిస్తున్నారు. ఇంతకు ముందు నార్త్ నుంచి ఈ కౌంట్ బాగా ఉండేది.. ఇప్పుడు సౌత్‌లోనూ సందడి గట్టిగానే కనిపిస్తోంది. వార్2లో ఏజెంట్‌గా కనిపించనున్నారు తారక్. యష్‌రాజ్ స్పై యూనివర్శ్ లో అతి త్వరలోనే అడుగుపెట్టనున్నారు మాన్ ఆఫ్ మాసెస్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Apr 04, 2024 | 9:51 PM

సిల్వర్‌స్క్రీన్ మీద ఏజెంట్స్ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మేల్, ఫీమేల్ అనే జెండర్ తేడా అక్కడ కనిపించడం లేదు. హీరోలకు ధీటుగా హీరోయిన్లు కూడా ఏజెంట్లుగా మెప్పిస్తున్నారు. ఇంతకు ముందు నార్త్ నుంచి ఈ కౌంట్ బాగా ఉండేది... ఇప్పుడు సౌత్‌లోనూ సందడి గట్టిగానే కనిపిస్తోంది.

వార్2లో ఏజెంట్‌గా కనిపించనున్నారు తారక్. యష్‌రాజ్ స్పై యూనివర్శ్ లో అతి త్వరలోనే అడుగుపెట్టనున్నారు మాన్ ఆఫ్ మాసెస్. వార్2లో హృతిక్, తారక్‌తో పాటు కియారా కూడా ఏజెంట్‌గానే కనిపిస్తారని టాక్.

మరోవైపు స్పై గా నటించడానికి యష్‌రాజ్ సంస్థకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆలియాభట్. ఆల్రెడీ హాలీవుడ్ ప్రాజెక్ట్ తో తనలోని యాక్షన్ యాంగిల్‌ని ఇంట్రడ్యూస్ చేశారు ఆలియా. ఇండియన్ స్పై మూవీలో ఈ లేడీ ఎలా చెలరేగుతారో చూడాలన్నది చాలా మంది డ్రీమ్.

అటు సమంత కూడా సిటాడెల్‌లో స్పైగా కనిపించనున్నారు. ఫ్యామిలీమ్యాన్‌లో ఆమెలోని ఇంకో యాంగిల్‌ని ఎస్టాబ్లిష్ చేసిన రాజ్ అండ్ డీకే, ఇప్పుడు ఈ సీరీస్‌లో ఎలా చూపిస్తారోననే క్యూరియాసిటీ బాగానే క్రియేటైంది జనాల్లో. సిటాడెల్‌లో వరుణ్‌ధావన్ కూడా ఏజెంట్‌గానే కనిపిస్తారు.

పఠాన్‌కి సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. పఠాన్‌లో షారుఖ్ తో పోటాపోటీగా యాక్షన్ సీక్వెన్స్ చేసిన దీపిక పదుకోన్ మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.

తమిళంలో విక్రమ్2, సర్దార్2 కూడా స్పై కాన్సెప్ట్ సినిమాలే. మన దగ్గర విజయ్ దేవరకొండ నెక్స్ట్ స్పై కంటెంట్ ఉన్న మూవీ చేయబోతున్నారు.

నిఖిల్ హీరోగా నటించనున్న ది ఇండియా హౌస్ కూడా ఈ థీమ్‌తో సగే కథే. అటు అడివి శేష్ గూఢచారి 2 అయితే ఇంటర్నేషనల్ మిషన్ ప్రధానంగా తెరకెక్కుతోంది.





























