- Telugu News Photo Gallery Cinema photos Mrunal Thakur Says About Sitaramam movie and Telugu Language telugu movie news
Mrunal Thakur: ఆ మూవీ సమయంలో రోజూ ఏడ్చేదాన్ని.. అదే చివరి సినిమా అనుకున్నా.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్..
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో తనదైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మృణాల్.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుంది.
Updated on: Apr 04, 2024 | 4:44 PM

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో తనదైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది.

ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న మృణాల్.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుంది. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమా రేపు విడుదల కానుంది.

ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ సీతారామం సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తెలుగు సినిమాలు చేయకూడదనుకున్నట్లు చెప్పారు.

భాష రాకపోతే నటించడం చాలా కష్టమని.. సీతారామం సమయంలో తెలుగు రాకపోవడం వల్ల రోజూ ఏడ్చేదాన్ని అని అన్నారు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక కష్టాన్నంతా మర్చిపోయానని మహారాణి పాత్రలో నటించాలని చిన్నప్పటి నుంచి కల అని తెలిపింది.

అందుకే సినిమా స్టోరీ చెప్పగానే ఏమీ ఆలోచించకుండా ఓకే చేశానని.. ఆ సినిమా కోసం మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందని.. తెలుగులో డైలాగ్స్ ఇంగ్లీష్ లో రాసుకొని రాత్రంతా ప్రాక్టీస్ చేసేదాన్ని అని అన్నారు.

హిందీ, మరాఠీలో కంటే తెలుగులో డైలాగ్స్ చెప్పడం చాలా కష్టంగా అనిపించిందని.. సీతారామమే తన మొదటి, చివరి తెలుగు సినిమా అని కశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో దుల్కర్ తో చెప్పానని అన్నారు.




