- Telugu News Photo Gallery Cinema photos Heroines Sai Pallavi and Keerthy Suresh follow Rashmika Mandanna and Pooja Hegde into bollywood Telugu Actress Photos
Sai Pallavi – Keerthy Suresh: రష్మిక , పూజ ను ఫాలో అవుతామంటున్న కీర్తి, పల్లవి.. ఏ విషయంలో?
కొత్త చోట అడుగుపెట్టేటప్పుడు, ముందు అక్కడ మన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ఆలోచిస్తాం. సినిమా ఇండస్ట్రీలోనూ అంతే జరుగుతుంది. ఇప్పుడు నార్త్ కి వెళ్లాలనుకుంటున్నారు సాయిపల్లవి, కీర్తీ. ఆల్రెడీ అడుగుపెట్టిన సీనియర్ల సక్సెస్‌గ్రాఫ్‌ని ఆసక్తిగా గమనిస్తున్నారు. వీరిద్దరిలో ఇంతకీ రష్మికను ఫాలో అయ్యేదెవరు.? సౌత్ క్వీన్స్ కి నార్త్ మీద పెద్దగా ఆశలు లేని టైమ్‌లో, మళ్లీ చలో ముంబై అంటూ సూట్‌కేస్ సర్దుకున్న హీరోయిన్ పూజా హెగ్డే.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Anil kumar poka
Updated on: Feb 22, 2024 | 2:22 PM

కొత్త చోట అడుగుపెట్టేటప్పుడు, ముందు అక్కడ మన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ఆలోచిస్తాం. సినిమా ఇండస్ట్రీలోనూ అంతే జరుగుతుంది. ఇప్పుడు నార్త్ కి వెళ్లాలనుకుంటున్నారు సాయిపల్లవి, కీర్తీ.

ఆల్రెడీ అడుగుపెట్టిన సీనియర్ల సక్సెస్‌గ్రాఫ్‌ని ఆసక్తిగా గమనిస్తున్నారు. వీరిద్దరిలో ఇంతకీ రష్మికను ఫాలో అయ్యేదెవరు.? సౌత్ క్వీన్స్ కి నార్త్ మీద పెద్దగా ఆశలు లేని టైమ్‌లో, మళ్లీ చలో ముంబై అంటూ సూట్‌కేస్ సర్దుకున్న హీరోయిన్ పూజా హెగ్డే.

అమ్మడి ఫీచర్స్ ని మెచ్చిన బాలీవుడ్ జనాలు మంచి ఆఫర్లనే ఇచ్చారు. కానీ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఫేమ్ అయితే రాలేదు పూజా మేడమ్‌కి. పూజా ఫెయిల్ అయిన చోట సక్సెస్ అయి చూపించారు నేషనల్ క్రష్.

రీసెంట్ యానిమల్‌తో సక్సెస్‌ఫుల్ కమర్షియల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. రష్మికకు బలమైన కేరక్టర్ ఇచ్చి, బెస్ట్ పెర్ఫార్మర్‌గా నార్త్ సర్కిల్స్ లో నిలబెట్టారు కెప్టెన్ సందీప్‌రెడ్డి వంగా.

పూజా, రష్మిక, నయన్ రూట్లో నార్త్ కి ట్రావెల్ చేసే పల్లవి, కీర్తీ గురించి ప్రస్తుతం మన దగ్గర ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆల్రెడీ ఉత్తరాదిన సినిమా ఓకే చేసి షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు సాయిపల్లవి.

జునైద్‌తో ఫారిన్‌లో షూటింగ్ చేస్తున్నారన్న న్యూస్ ఈ మధ్య బాగా హల్‌చల్ చేసింది. పల్లవి సినిమా విషయంలో అఫిషియల్ కన్‌ఫర్మేషన్ లేకపోయినా, కీర్తీ సురేష్ మాత్రం అట్లీ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెడుతున్నారు.

అటు పల్లవి, ఇటు కీర్తీ ఇద్దరూ మన దగ్గర మంచి పెర్ఫార్మర్లే. రష్మికకు సందీప్ రెడ్డి వంగా హిట్ ఇచ్చినట్టు, కీర్తికి అట్లీ అండగా ఉంటారా? అదే జరిగితే పల్లవికి అక్కడ బ్యాక్ బోన్ ఎవరవుతారు? ఇలాంటి డిస్కషన్ బాగానే వినిపిస్తోంది.





























