- Telugu News Photo Gallery Cinema photos Heroines lady superstar Nayanthara follows Trisha Krishnan in movies selecting Telugu Actress Photos
Trisha Krishnan – Nayanthara: ఆ విషయంలో నయన్ కూడా త్రిషను ఫాలో అయిపోతున్నారా..?
అన్నీ హిట్లతో దూసుకుపోతుంటే కెప్టెన్లకు వేల్యూ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. రికార్డులు వెయ్యి కోట్లను టచ్ చేస్తుంటే హీరోలకు తిరుగుండదు. మరి హీరోయిన్ల సక్సెస్‌ని ఎలా కేల్కులేట్ చేయాలి.? దానికి అంత తర్జనభర్జన ఎందుకు.. ఒక్కసారి త్రిష వైపు చూడండి. సక్సెస్‌కి సిసలైన అడ్రస్ అంటున్నారు క్రిటిక్స్. అందరూ అంటున్నారనేమో, నయన్ కూడా త్రిషను ఫాలో అయిపోతున్నారు. 96కి ముందు, 96కి తర్వాత అని రాసుకోవాలేమో త్రిష తన కెరీర్‌ని.
Updated on: May 28, 2024 | 8:43 PM

మలయాళంలో మోహన్‌లాల్ రామ్, టొవినో థామస్ ఐడెంటిటీ సినిమాల షూటింగ్ కూడా ప్యారలల్‌గా జరుగుతోంది. తాజాగా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంభర టీమ్‌తోనూ జాయిన్ అయ్యారు.

దానికి అంత తర్జనభర్జన ఎందుకు.. ఒక్కసారి త్రిష వైపు చూడండి. సక్సెస్‌కి సిసలైన అడ్రస్ అంటున్నారు క్రిటిక్స్. అందరూ అంటున్నారనేమో, నయన్ కూడా త్రిషను ఫాలో అయిపోతున్నారు.

96కి ముందు, 96కి తర్వాత అని రాసుకోవాలేమో త్రిష తన కెరీర్‌ని. గతంలో వరుసగా కమర్షియల్ సినిమాలు చేసిన త్రిష, రీసెంట్ టైమ్స్ లో అన్నీ రకాల పాత్రలనూ పోషిస్తున్నారు. భాషా బేధం లేకుండా అన్నీ ఇండస్ట్రీల్లోనూ, అందరు స్టార్లతోనూ నటిస్తున్నారు.

20 ఏళ్ల హీరోయిన్ అందంగా ఉండటం ఆశ్చర్యం ఏమీ లేదు, ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్ల తర్వాత హీరోయిన్ అంతే అందంగా ఉండటం గొప్పే అని రీసెంట్‌గా దళపతి విజయ్ కూడా మెచ్చుకున్నారు త్రిషని.

ఒక్కో సినిమాకు నయనతార పది నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తారన్నది మార్కెట్ న్యూస్. అయితే ఇప్పుడు ఈ ఫిగర్‌ని నేషనల్ క్రష్ రష్మిక బీట్ చేశారన్నది ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్న మాట.

ఆ మధ్య కాస్త స్లో అయిన కెరీర్‌ని మళ్లీ ఫిప్త్ గేర్‌లోకి మార్చేస్తున్నారు. నార్త్ ఎంట్రీలోనూ సూపర్ అనిపించుకున్న నయన్ ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా అన్నీ సినిమాలనూ యాక్సెప్ట్ చేస్తున్నారు.

తమిళ్‌లో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌కి సైన్ చేస్తున్న ఈ బ్యూటీ, అదర్ లాంగ్వేజెస్‌లో మాత్రం ఎక్కువగా స్టార్స్ ఉన్న సినిమాలనే సెలక్ట్ చేసుకుంటూ యమా బిజీ అవుతున్నారు.




