- Telugu News Photo Gallery Cinema photos Heroine Keerthy Suresh says Once I agree, I will give hundred percent efforts Telugu Actress Photos
Keerthy Suresh: మరోసారి ట్రెండ్ అవుతున్న కీర్తి సురేష్ మాటలు.. మనసుకు నచ్చితే.. నిన్నైతే అంతే..!
పూర్తి స్థాయిలో ఓ విషయాన్ని నమ్మి చేసినప్పుడు తప్పకుండా ఏదో రకంగా సక్సెస్ అయ్యే తీరుతామని అంటున్నారు నటి కీర్తీ సురేష్. తన విషయంలో ఇది చాలా సార్లు ప్రూవ్ అయిందని చెబుతున్నారు ఈ బ్యూటీ. లేటెస్ట్ గా కల్కి సినిమాలో బుజ్జి కేరక్టర్‌కి వాయిస్ ఇచ్చిన హైలో ఉన్నారు మహానటి. ఆ జోష్‌లో ఉండగానే మరో గుడ్‌న్యూస్ ఆమె తలుపులు తట్టేసింది.మహానటితో ప్రూవ్ చేసుకున్నప్పటి నుంచి నటనకు అవకాశం ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు కీర్తి సురేష్.
Updated on: May 28, 2024 | 8:01 PM

పూర్తి స్థాయిలో ఓ విషయాన్ని నమ్మి చేసినప్పుడు తప్పకుండా ఏదో రకంగా సక్సెస్ అయ్యే తీరుతామని అంటున్నారు నటి కీర్తీ సురేష్. తన విషయంలో ఇది చాలా సార్లు ప్రూవ్ అయిందని చెబుతున్నారు ఈ బ్యూటీ.

లేటెస్ట్ గా కల్కి సినిమాలో బుజ్జి కేరక్టర్‌కి వాయిస్ ఇచ్చిన హైలో ఉన్నారు మహానటి. ఆ జోష్‌లో ఉండగానే మరో గుడ్‌న్యూస్ ఆమె తలుపులు తట్టేసింది.

మహానటితో ప్రూవ్ చేసుకున్నప్పటి నుంచి నటనకు అవకాశం ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు కీర్తి సురేష్. తమిళ్‌లో సాని కాయిదం సినిమాలో ఆమె నటనను చూసి జనాలు ఫిదా అయ్యారు.

ఈ సినిమాకు అవార్డులు గ్యారంటీ అని అప్పుడే అనుకున్నారు. ఆ మాట ఇప్పుడు నిజమైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్‌కి ఒకాసా తమిళ్ ఇంటర్నేషనల్ అవార్డు దక్కింది.

బాలీవుడ్‌లో కీర్తిసురేష్ డెబ్యూ ప్రాజెక్ట్ బేబీ జాన్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. సౌత్‌లో కెరీర్ స్టార్టింగ్‌లో పక్కింటి అమ్మాయి రోల్స్ చేసిన కీర్తి... ఇప్పుడు వెస్టర్న్ కాస్ట్యూమ్స్ తోనూ హల్ చల్ చేస్తున్నారు.

ముంబై వీధుల్లో పక్కా మోడ్రన్ గర్ల్ గా ప్రొజెక్ట్ అవుతున్నారు ఈ బ్యూటీ. ప్రాజెక్టు ఏదైనా సరే, ఒక్కసారి మనసుకు నచ్చి ఒప్పుకున్నాక హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతానని అంటున్నారు కీర్తీ సురేష్.

నటనకు స్కోప్ ఉంటే అవార్డులు గ్యారంటీ, ఫక్తు కమర్షియల్ మూవీ అయితే పక్కాగా కాసులు కురస్తాయనే ఫార్ములాను నమ్ముతున్నారు మిస్ కీర్తి.




