- Telugu News Photo Gallery Cinema photos Heroine Taapsee Pannu White saree Photos goes viral in social media on July 2024 Telugu Actress Photos
Taapsee Pannu: వయ్యారాల పరువం.. చీరకట్టు అందాలలో మేనకలా తాప్సీ వయ్యారాలు.
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవలే తన ప్రియుడు డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో ఏడడుగులు వేసింది. పదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు కొన్ని నెలల క్రితం ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.
Updated on: Jul 27, 2024 | 6:21 PM

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

ఇటీవలే తన ప్రియుడు డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోతో ఏడడుగులు వేసింది. పదేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు కొన్ని నెలల క్రితం ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

ఈబ్యూటీ పెళ్లికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తూనే తిరిగి బిజీ అయ్యింది.

సినిమాలోనే కాదు ఇంటర్వ్యూలలో కూడా తాప్సి బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ నేచుకుంటూనే.. వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ తో అదరగొడుతోంది ఈ చిన్నది.

తాప్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంబానీ ఇంట పెళ్లికి హాజరుకాకపోవడంపై స్పందిస్తూ.. నిజం చెప్పాలంటే వాళ్లు నాకు వ్యక్తిగతంగా తెలియదు.

పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి మధ్య కనీసం ఏదో ఒకరకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తాను,

అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతాను అని తాప్సీ చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె మూడు సినిమాల్లో పనిచేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.




