- Telugu News Photo Gallery Cinema photos Heroine Samantha Praises Nayanthara For This Reason, Details Here Telugu Actress Photos
Samantha vs Nayanthara: అప్పుడు నయనతారను తెగ పొగిడేసిన సమంత.! మరి ఇప్పుడు..
ఆమె వచ్చింది చూసింది దృష్టిపెట్టింది.. అనుకున్నది సాధించింది.. ఆమె క్వీన్ అంటూ నయనతారను తెగ పొగిడేశారు సమంత. ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఓకే.. కాంట్రవర్శీల్లోనూ ఇద్దరి మధ్య కామన్ పాయింట్ పట్టుకున్నారు నెటిజన్లు. ఆ మధ్య ఆల్టర్నేటివ్ థెరపీ గురించి సమంత ప్రస్తావించినప్పుడు హెల్త్ ఇల్లిటరేట్ అని ఓ డాక్టర్ డైరక్ట్ గా స్పందించడం వివాదానికి దారి తీసింది.
Updated on: Aug 02, 2024 | 9:31 PM

ఆమె వచ్చింది చూసింది దృష్టిపెట్టింది.. అనుకున్నది సాధించింది.. ఆమె క్వీన్ అంటూ నయనతారను తెగ పొగిడేశారు సమంత. ఇద్దరికీ మంచి బాండింగ్ ఉంది.

ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఓకే.. కాంట్రవర్శీల్లోనూ ఇద్దరి మధ్య కామన్ పాయింట్ పట్టుకున్నారు నెటిజన్లు. ఆ మధ్య ఆల్టర్నేటివ్ థెరపీ గురించి సమంత ప్రస్తావించినప్పుడు హెల్త్ ఇల్లిటరేట్ అని ఓ డాక్టర్ డైరక్ట్ గా స్పందించడం వివాదానికి దారి తీసింది.

తాను వాడిన పదం పరుషంగా ఉండొచ్చేమోగానీ, తాను చెప్పదలచుకున్న విషయం మాత్రం సరైనదే అంటూ చెప్పాలనుకున్నవిషయాన్ని స్ట్రాంగ్‌గా చెప్పారు డాక్టర్.

ఇండియాలో ఉన్న ఆల్టర్నేటివ్ థెరపీల గురించి, వైద్యులు, వ్యాధిగ్రస్తులకు వాటి మీద ఉన్న నమ్మకం గురించి సమంత చాలా విషయాలనే ప్రస్తావించారు. రీసెంట్ టైమ్స్ లో నెట్టింట్లో బాగా వైరల్ అయిన టాపిక్ ఇది.

సమంత టాపిక్ ఇంకా సర్దుమణగనే లేదు. అప్పుడే నయనతార ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు. మందార పువ్వుల టీ తాగడం మంచిదని నయన్ చేసిన పోస్టుకు సేమ్ డాక్టర్.. సిరాయిక్ అబ్బీ ఫిలిప్స్ స్పందించారు.

మిస్ లీడ్ చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఎవరికైనా అనుమానాలుంటే, ఈ పోస్టు చూడమంటూ నయన్ కూడా ఓ లింక్ షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అవుతోంది.




