Kamal Haasan: నిరాశపర్చిన భారతీయుడు 2.. తర్వాతి సినిమాలపై కమల్ కన్ఫ్యూజన్.!
భారతీయుడు 2 డిజాస్టర్ కావటంతో కమల్ సినిమాల లైనప్ విషయంలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ప్రజెంట్ భారతీయుడు 3తో పాటు థగ్ లైఫ్ సినిమాలతో బిజీగా ఉన్నారు కమల్. ఈ రెండు సినిమాలు దాదాపు ఫైనల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. దీంతో ఏ సినిమాను ముందు రిలీజ్ చేయాలన్న విషయంలో డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 దారుణంగా ఫెయిలయ్యింది.