- Telugu News Photo Gallery Cinema photos Heroine Meenakshi Chaudhary interesting comments on her marriage and relationship, Details Here
Meenakshi Chaudhary: సౌత్ సర్కిల్స్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి.! నెట్టింట ఈమె టాపిక్..
ప్రజెంట్ సౌత్ సర్కిల్స్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ ఇప్పుడు టాప్ హీరోలతో జోడీ కడుతూ స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. అదే సమయంలో వరుస సినిమాలతో మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్‌గానూ పేరు తెచ్చుకుంటున్నారు. అందుకే ఈ బ్యూటీ మీద రూమర్స్ కూడా గట్టిగానే వైరల్ అవుతున్నాయి. తెలుగులో మహేష్ బాబు, తమిళ్‌లో విజయ్ సినిమాల్లో ఛాన్స్ రావటం అంటే ఏ హీరోయిన్‌కైనా ఓ కల.
Updated on: Nov 25, 2024 | 1:18 PM

ప్రజెంట్ సౌత్ సర్కిల్స్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి. చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ ఇప్పుడు టాప్ హీరోలతో జోడీ కడుతూ స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవుతున్నారు.

అదే సమయంలో వరుస సినిమాలతో మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్‌గానూ పేరు తెచ్చుకుంటున్నారు. అందుకే ఈ బ్యూటీ మీద రూమర్స్ కూడా గట్టిగానే వైరల్ అవుతున్నాయి.

తెలుగులో మహేష్ బాబు, తమిళ్‌లో విజయ్ సినిమాల్లో ఛాన్స్ రావటం అంటే ఏ హీరోయిన్‌కైనా ఓ కల. అలాంటి కల కెరీర్ ఎర్లీ డేస్‌లోనూ నిజం చేసుకున్నారు హ్యాపెనింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి.

మహేష్ గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈ బ్యూటీ, విజయ్ ది గోట్‌లోనూ హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.. రీసెంట్‌గా వరుణ్ తేజ్ మట్కా, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ..

త్వరలో విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సంక్రాంతి వస్తున్నాంలో వెంకటేష్‌కు జోడీగా నటిస్తున్నారు. ఇంత బిజీగా ఉన్న టైమ్‌లో ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది.

తన తొలి తెలుగు సినిమా హీరో సుశాంత్‌ను మీనాక్షి పెళ్లి చేసుకోబుతున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు ఈ బ్యూటీ.

తాను ఎవరినీ పెళ్లి చేసుకోవటం లేదని, అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే తనకు లేదని తేల్చేశారు. దీంతో మీనాక్షి పెళ్లి వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. ప్రస్తుతం మీనాక్షి మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి.

ఇన్ని సినిమాలకు ఏ మాత్రం ప్రాబ్లమ్ లేకుండా డేట్స్ అడ్జస్ట్ చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ. దీంతో త్వరలోనే మీనాక్షి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ రేసులో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.




