- Telugu News Photo Gallery Cinema photos Heroine LAYA About Her Job In U.S.A Latest Photos From Work Place
Laya: అమెరికాలో హీరోయిన్ లయ ఏం జాబ్ చేస్తుందో తెలుసా? ఈ-ఎయిర్ బస్ సంస్థలో..
కుటుంబ కథా చిత్రాల్లో నటించి.. తెలుగువారి హృదయాల్లో పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకున్న నటి. కెరీర్ పీక స్టేజ్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈ నటి అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆమె అక్కడ ఏం చేస్తున్నారు..? జాబ్ రోల్ ఏంటి తెలుసుకుందాం పదండి.
Updated on: Apr 26, 2023 | 9:54 PM

'స్వయంవరం' మనసున్న మారాజు, హనుమాన్ జంక్షన్, మనోహరం, ప్రేమించు, మిస్సమ్మ వంటి చిత్రాలు లయకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా ఆమె సినిమాలు చేశారు.

పెళ్లి తర్వాత భర్తతో కలిసి యూఎస్‌లో సెటిల్ అయిన లయ.. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ, ఫోటోస్ పెడుతూ ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటున్నారు. అయితే రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన చాలా రోజులు సందడి చేసి వెళ్లారు.

తాజాగా తాను యూఎస్‌లో ఏం జాబ్ చేస్తున్నానో చెప్పారు లయ. వర్క్ చేసే ప్లేస్‌లో దిగిన ఫోటోలు ఇన్స్టోలో పోస్ట్ చేశారు. కాలిఫోర్నియాలోని జోబీ ఏవియేషన్ ఏరో స్పేస్ కంపెనీలో ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు లయ వెల్లడించారు.

తెలుగు ఇండస్ట్రీలో దశాబ్ధకాలం పాటు హీరోయిన్‌గా రాణించిన.. లయ మంచి చెస్ ప్లేయర్ కూడా. టెన్త్ క్లాస్ వరకు చెస్ పోటీలలో పాల్గొని.. రాష్ట్రస్థాయిలో ఏడుసార్లు, జాతీయస్థాయిలో ఒకసారి మెడల్స్ గెలుచుకున్నారు.

లయ భర్త పేరు గణేష్ గోగుర్తి. ఆయన అమెరికాలో ఫేరున్న డాక్టర్. లయ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె ప్రజంట్ తొమ్మిదో తరగతి చదువుతుండగా.. కుమారుడికి 12 ఏళ్లు ఉంటాయి.




