- Telugu News Photo Gallery Cinema photos Hero Ram Charan Game changer Movie team create shapes on Movie, Details here Telugu Heroes Photos
Game changer: గేమ్ చేంజర్ పేరు చెప్పి చెర్రీ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న మూవీ టీం..
అభిమానుల ఆశల మీద మరోసారి నీళ్లు చల్లేసింది గేమ్ చేంజర్ టీమ్. దసరా టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి అలాంటిదేం లేదంటూ షాక్ ఇచ్చింది యూనిట్. అయితే కాసత్ ఆలస్యమైన ఈ వెయిటింగ్ వర్తే అంటూ మరోసారి ఫ్యాన్స్‌ను కన్విస్ చేసేందుకు ట్రై చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆడియన్స్‌కు మరోసారి షాక్ ఇచ్చింది గేమ్ చేంజర్ టీమ్. దసరాకి టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది.
Updated on: Oct 16, 2024 | 12:49 PM

అబ్బాయ్ కోసం బాబాయ్ తరలి వస్తున్నారనే టాపిక్ యమాగా కిక్ ఇస్తోంది. గేమ్ చేంజర్ లేటెస్ట్ మెలోడీకి కూడా మంచి మార్కులు పడుతున్నాయి.

సినిమా ఏదైనా ఇష్యూను తీసుకుని రాజకీయంగా దాన్ని బాగా చూపిస్తారు శంకర్. చాలా ఏళ్ళ తర్వాత గేమ్ ఛేంజర్‌తో ఇదే చేయాలని చూస్తున్నారు ఈ దర్శకుడు.

దసరాకి టీజర్ పక్కా అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియా చాట్ సెషన్‌లో పాల్గొన్న తమన్ ఈ విషయాన్ని రివీల్ చేశారు. దసరాకు అప్‌డేట్ లేదన్న తమన్, ఈ వెయిటింగ్ వర్తే అనిపించే రేంజ్ కంటెంట్ రెడీ అవుతుందని హామీ ఇచ్చారు.

గేమ్ చేంజర్ సినిమాను బిగ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు శంకర్. గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీగా ఉంది. ఆ పనులు పూర్తి చేయడానికే కాస్త టైమ్ పడుతుందని, ఈ టైమ్‌లో టీజర్, గింప్ల్స్ అంటూ వేరే పనులు పెట్టుకుంటే మెయిన్ వర్క్ డిస్ట్రబ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు.

దసరా మిస్ అయితే దీపావళికి బ్లాస్ట్ ఉంటుందని ఆడియన్స్‌ను కన్విన్స్ చేసేందుకు ట్రై చేశారు తమన్. అక్టోబర్ 30న థర్డ్ సింగిల్ పక్కాగా రిలీజ్ అవుతుందని హామీ ఇచ్చారు. తాజా అప్‌డేట్‌లో రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారటీ ఇచ్చారు.

డిసెంబర్ 20 లేదా క్రిస్టమస్‌కి సినిమా రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇండియన్ 2 లాంటి సినిమాలతో వెనకబడ్డారు శంకర్. చాన్నాళ్ళ తర్వాత గేమ్ ఛేంజర్‌తో కంటెంట్ ఉన్న సినిమాతో వస్తున్నారు శంకర్. ఇందులో తెలుగు స్టేట్ పాలిటిక్స్ ఉంటాయని దిల్ రాజే చెప్తున్నారు.





























