Happy Birthday Tamannaah: మిల్కీ బ్యూటీ నీకు లేదు పోటీ.. హ్యాపీ బర్త్ డే తమన్నా..
డిసెంబర్ 21న తమన్నా భాటియా పుట్టిన రోజు సందర్భంగ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ గురించి కొన్ని విషయాలు
Phani CH |
Updated on: Dec 21, 2021 | 12:10 PM

డిసెంబర్ 21న తమన్నా భాటియా పుట్టిన రోజు సందర్భంగ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ గురించి కొన్ని విషయాలు

బాలీవుడ్ సినిమాలతో సినీ ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు తరువాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన ఆమె నటిగా తన ప్రస్థానం 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాతో మొదలుపెట్టింది.

అయితే అక్కడ ఆమెకు పెద్దగా కలిసిరాకపోయినా ఏడాది శ్రీ సినిమాతో తెలుగులో, ఆ తదుపరి ఏడాది కేడీ సినిమాతో తమిళంలో అడుగు పెట్టింది.

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతోంది అందాల తార తమన్నా.

కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లో సినిమాలు చేస్తుంది తమన్నా. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ.

ఈ రోజుల్లో ఓ హీరోయిన్ ఐదేళ్ల కొనసాగిస్తేనే అమ్మో అంటారు. అలాంటిది ఒకటిన్నర దశాబ్ధం నుంచి సినిమాలు చేస్తూనే ఉంటుంది తమన్నా.

పైగా ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఇప్పటికీ తన స్థానం తనదే అంటూ నిరూపించుకుంటుంది ఈ మిల్కీ బ్యూటీ.

ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలు చేస్తుంది. ఇటీవలే గోపీచంద్ హీరోగా నటించిన సీటీమార్ సినిమాతో హిట్ అందుకుంది తమన్నా.

అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది తమన్నా .

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన నటిస్తుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తమన్నా చాలా యాక్టివ్ గా ఉంటుంది.





























