- Telugu News Photo Gallery Cinema photos HanuMan Heroine Amritha Aiyer Intresting Comments About Her Marriage
Tollywood: వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటాను.. కాబోయే భర్త గురించి నిజాలు బయటపెట్టిన హీరోయిన్..
ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటుంది. కెరీర్ తొలినాళ్లల్లో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు కథానాయికగా దక్షిణాదిలో రాణిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
Updated on: Dec 17, 2024 | 9:52 AM

టాలీవుడ్ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

హనుమాన్ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది. తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం అల్లరి నరేశ్ హీరోగా నటించిన బచ్చలమల్లి సినిమాలో కథానాయికగా నటిస్తుంది.

ఈ సినిమా డిసెంబ్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమృతా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

వచ్చే ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపింది. కానీ ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని మాత్రం అస్సలు మ్యారేజ్ చేసుకోనని.. సినీరంగానికి అసలు సంబంధమే లేని వ్యక్తిని చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

ఇద్దరిదీ ఒకే ఫీల్స్ అయితే పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని.. అందుకే ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని వద్దు అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవచ్చని తెలిపింది.




