AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025 Hit Movies: 2025లో అర్ద సంవత్సరం పూర్తి.. టాలీవుడ్ హిట్ సినిమాలు ఇవే..

2025లో అర్ద సంవత్సరం (6 నెలలు) పూర్తయింది. ఈ 6 నెలల్లో తెలుగులో చాలా సినిమాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి.  మరి ఈ ఏడాది సగం పూర్తయ్యేటప్పకి జనవరి నుంచి జూన్ వరకు.. బాలయ్య నుంచి నాని వరకు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న తెలుగు సినిమాలు ఏంటి.? ఈరోజు మనం తెలుసుకుందామా మరి.. 

Prudvi Battula
|

Updated on: Jul 02, 2025 | 1:07 PM

Share
జనవరి విషయానికి వస్తే టాలీవుడ్‎కి మంచి బూస్టుప్ ఇచ్చిదనే చెప్పాలి. ఎందుకంటే ఈ నెలల్లో మొత్తం 3 సినిమాలో వెండి తెరపై సత్తా చూపించాయి. అందులో మొదటిది వెంకీ మామ 'సంక్రాంతికి వస్తున్నాం'. 300 కోట్లు వసూళ్లు చేసిన తోలి రీజినల్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో పాటు వచ్చిన బాలయ్య 'డాకు మహారాజ్' కూడా బ్లక్ బస్టర్ అయింది. అలాగే సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధి తాత చెట్టుకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 

1 / 5
ఫిబ్రవరిలో మాత్రం ఒక్క సినిమా మాత్రమే టాలీవుడ్‎కి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. అదే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' మూవీ. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ నెలలో వన్ అండ్ ఓన్లీ హిట్ మూవీగా నిలిచింది.

2 / 5
మార్చిలో కూడా చాలా తెలుగు సినిమాలు విడదల అయ్యాయి. కానీ హిట్ అయినవి మాత్రం రెండు చిత్రాలు మాత్రమే.  వాటిలో మొదటిది 'కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియాదర్శి, రోషన్, కొత్త అమ్మాయి శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత శివాజీ నటించిన చిత్రమిది. అలాగే ఈ నెలలో హిట్ అయినా మరో సినిమా 'మ్యాడ్ స్క్వేర్'. ఇందులో సంగీత్ శుభాన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలు.

3 / 5
అయితే ఏప్రిల్ నెలలో సినిమాలు వచ్చిన హిట్స్ శున్యమనే చెప్పాలి. మరి మే విషయానికి రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆవే నాని 'హిట్ 3' అండ్ శ్రీవిష్ణు '#సింగల్'. తక్కువ గ్యాప్‎లో వచ్చిన ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకటి మాస్ హిట్ అయితే మరొకటి కామెడీ బ్లాక్ బస్టర్. 

4 / 5
చివరిగా జూన్ నెలలో  టాలీవుడ్‎కి రెండు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇవి రెండు కూడా ఒకేరోజు విడుదల అవడం విశేషం. వాటిలో మొదటిది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'కుబేర'. ఇందులో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో కనిపించారు. అలాగే జూన్ నెలలో మరో హిట్ ఓ చిన్న సినిమా అందుకుంది. అదే మ్యాడ్ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన '8 వసంతాలు'. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. 

5 / 5