- Telugu News Photo Gallery Cinema photos Guess the heroine in this child childhood photos she is aparna balamurali
అందంలోనే కాదు నటనలోనూ తోపు.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?
ఇటీవల సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫోటోలను, లేటెస్ట్ పిక్స్ ను తెగ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బ్యూటీ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో కనిపెట్టారా.?
Updated on: Sep 12, 2024 | 2:54 PM

ఇటీవల సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫోటోలను, లేటెస్ట్ పిక్స్ ను తెగ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బ్యూటీ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో కనిపెట్టారా.?

ఆ బ్యూటీ ఎవరో కాదు. అపర్ణ బాలమురళి. ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అపర్ణా బాలమురళి సెప్టెంబర్ 11, 1995న త్రిసూర్‌లో జన్మించారు. అతని తండ్రి కెపి బాలమురళి సంగీత స్వరకర్త.

కేరళలో పుట్టి పెరిగిన నటి అపర్ణా బాలమురళి మలయాళ చిత్రాల్లో నటించడం ప్రారంభించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. మలయాళంలో 'మహేషిండే ప్రతీకారం' సినిమాతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ

అపర్ణా బాలమురళి 2017లో విడుదలైన '8 బుల్లెట్స్' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'సురరైప్ పొట్టు' సినిమాలో సూర్య కథానాయికగా నటించి మెప్పించింది. ఇదే సినిమా తెలుగులో ఆకాశం నీ హద్దురా. పేరుతో డబ్ అయ్యింది.

Aతమిళ అభిమానుల ఆదరణ పొందిన నటి అపర్ణా బాలమురళి, నటుడు ధనుష్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'రాయన్ ' చిత్రంలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళం, మలయాళం రెండు భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్న అపర్ణ బాలమురళి, విజయ్ సరసన తలపతి 69లో నటించబోతున్నట్లు ఇటీవల కోలీవుడ్ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది.




