- Telugu News Photo Gallery Cinema photos Guess the Actor In This Photo He Is Actor Sudheer Babu Badminton Days Photos Goes Viral
Tollywood: బ్యాడ్మింటన్ మెడల్ అందుకుంటున్న స్టార్ హీరో.. వరుస హిట్స్‌తో ఫుల్ జోష్..
సినీరంగంలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్న పాత్రలలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ హీరో.. మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. దివంగత స్టార్ హీరోకు దగ్గరి బంధువు. అయినప్పటికీ తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Updated on: Jan 29, 2025 | 10:23 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ మరెవరో కాదు.. దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు. మహేష్ బాబుకు బావ. వీరిద్దరి స్టార్ డమ్ ఉపయోగించుకోకుండానే నటుడిగా అరంగేట్రం చేసి మెప్పించి తనకంటూ ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని ఘట్టమనేని భర్త సుధీర్ బాబు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 2010లో ఏ మాయ చేసావే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత శివ మనసులో శృతి సినిమాతో హీరోగా మారాడు.

తెలుగులో మోసగాళ్లకు మోసగాడు, నన్ను దోచుకుందవటే సినిమాల్లో నటించి మెప్పించాడు. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అతడు ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్.

ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. అలాగే డబుల్స్ భాగస్వామిగా పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆడాడు. అప్పట్లో బ్యాడ్మింటన్ రన్న రప్ మెడల్ అందుకుంటున్న ఫోటో ఇది.

క్రికెట్ లో మంచి ప్లేయర్. ఫిట్ నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సుధీర్ బాబు. త్వరలోనే సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్ సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడు. ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.




