- Telugu News Photo Gallery Cinema photos Game Changer star Ram Charan and Sharwanand in Balakrishna Unstoppable with NBK season 4 see photos
Ram Charan – Balakrishna : అన్‌స్టాపబుల్ సెట్‌లో గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్‌ను ఆటపట్టించిన శర్వానంద్, బాలయ్య..
నందమూరి హోస్టింగ్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ అయిన ఈ టాక్ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అన్‌స్టాపబుల్ సెట్ లో సందడి చేశారు రామ్ చరణ్. ఈ ఎపిసోడ్ ఫోటోస్ రిలీజ్ చేసింది ఆహా.
Updated on: Dec 31, 2024 | 7:19 PM

బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి కాగా.. ఇప్పుడు నాలుగో సీజన్ రన్ అవుతుంది.

ఈ సీజన్ ఏడో ఎపిసోడ్ లో విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి, సురేష్ బాబు సందడి చేయగా.. ఇప్పుడు ఎనిమిదో ఎపిసోడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు.

గేమ్ చేంజర్ ప్రమోషన్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారు చరణ్. మంగళవారం ఉదయం 7 గంటల నుంచే షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా రిలీజ్ చేసింది ఆహా. ఆ ఫోటోలలో చరణ్ మరింత స్టైలీష్ గా కనిపిస్తుండగా.. చెర్రీతోపాటు శర్వానంద్ సైతం సందడి చేశారు.

సంక్రాంతి బరిలో బాలయ్య, చరణ్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ గా చరణ్, డాకూ మహారాజ్ గా బాలయ్య థియేటర్లలోకి రాబోతున్నారు.




