- Telugu News Photo Gallery Cinema photos Dulquer Salmaan From Actor to Successful Producer with Lokam Chapter 1
Dulquer Salmaan: అదృష్టం అంటే అలా ఉండాలి.. ఏం చేసినా హిట్లే! బొమ్మలే..
పట్టిందల్లా బంగారమే అంటుంటారు కదా..? ఇప్పుడు ఈ మాట ఓ హీరోకు బాగా సెట్ అవుతుంది. ఓ వైపు నటుడిగా వరస విజయాలు అందుకుంటున్నాడు.. తనది కాని ఇండస్ట్రీలో జెండా పాతేసాడు.. ఇప్పుడు నిర్మాతగా కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఎవరా మిడాస్ టచ్ ఉన్న హీరో..? ఆయన చేస్తున్న సినిమాలేంటి..?
Updated on: Sep 01, 2025 | 11:12 PM

లక్కీ భాస్కర్ కాదు.. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ జోరు చూస్తుంటే లక్కీ దుల్కర్ అని మార్చాలేమో టైటిల్..? మనోడి దూకుడు అలాగే ఉందిప్పుడు. మిడాస్ టచ్ అన్నట్లు దుల్కర్ అడుగు పెడితే గెలుపు తలుపు తడుతుంది.

హీరోగానే కాదు.. నిర్మాతగానూ రప్ఫాడిస్తున్నారు దుల్కర్. తాజాగా ఈయన నిర్మించిన లోక్: ఛాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది. హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హీరోయిన్ సినిమా కొత్త లోక ఛాప్టర్ 1.

కేరళ జానపద కథల్లోకి నీలి అనే పాత్ర చుట్టూ ఈ క్యారెక్టర్ సాగుతుంది. ఫాంటసీ అంశాలతో పాటు అదిరిపోయే స్క్రీన్ ప్లే కొత్త లోక సినిమాకు ప్రధాన బలం. తన వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు దుల్కర్.

తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై నాగవంశీ విడుదల చేసారు. వార్ 2 డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన నాగ వంశీ.. కొత్త లోక సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కారు. తెలుగులో చాలా సైలెంట్‌గా విడుదలైన ఈ చిత్రానికి మౌత్ పబ్లిసిటీ బాగా హెల్ప్ అవుతుంది.

పైగా పాజిటివ్ టాక్ కూడా రావడంతో ఈ వీకెండ్ నాటికి కొత్త లోక కలెక్షన్స్ ఇంకా పెరిగేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి వార్ 2 షాక్ నుంచి నాగవంశీ త్వరగానే బయటికొచ్చేసారు.




