- Telugu News Photo Gallery Cinema photos Do you remember the actress in this photo? She is none other than huma qureshi
ఈ బూరెబుగ్గల బుజ్జాయి గుర్తుపట్టారా.? స్టార్ హీరోలతో నటించింది ఆ అమ్మడు
సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్స్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తమ ఫెవరెట్ హీరోయిన్ ఫోటోలను అభిమానులు నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అమ్మడి చిన్ననాటి ఫోటో చెక్కర్లు కొడుతోంది.
Updated on: Aug 31, 2024 | 9:44 AM

సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్స్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. తమ ఫెవరెట్ హీరోయిన్ ఫోటోలను అభిమానులు నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అమ్మడి చిన్ననాటి ఫోటో చెక్కర్లు కొడుతోంది.

ఆ బ్యూటీ ఎవరో కాదు హుమా ఖురేషి. ఈ ముద్దుగుమ్మ 28 జూలై 1986న ఢిల్లీలో సలీం ఖురేషీ, అమీనా ఖురేషీ దంపతులకు జన్మించారు. ఆమె బాలీవుడ్ సినీ పరిశ్రమలో నటుడు అమీర్ ఖాన్‌తో సామ్‌సంగ్ మొబైల్ యాడ్ లో అలాగే నటుడు షారుక్ ఖాన్‌తో నెరోలాక్ యాడ్ లో నటించడం ద్వారా క్రేజ్ తెచ్చుకుంది.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సిరీస్‌లో హ్యూమా ఖురేషి తన పాత్రతో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అజిత్ కుమార్ బిల్లా 2లో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. అయితే, బిల్లా 2 షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఆమె చిత్రం నుండి తప్పుకుని తిరిగి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.

2018లో బా.రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన 'కాలా' చిత్రంలో కాలా స్నేహితురాలు జరీనాగా నటించి మెప్పించింది. ఈ చిత్రంలో రజనీ, హ్యూమా కలిసి చేసిన ‘కన్నమ్మ’ పాట ఇప్పటికీ అభిమానుల చెవుల్లో మారుమోగుతోంది.

ఆ తర్వాత నటుడు అజిత్ కుమార్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వలిమై' సినిమాలో 'సోఫియా' పాత్రలో నటించి ఫేమస్ అయ్యింది హ్యూమా ఖురేషి. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించి తనదైన నటనతో ఆకట్టుకుంది.




