- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine who received a hundred crore hit is, She is Kalyani Priyadarshan
కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఆచితూచి అడుగేస్తున్న అందాల భామ.. ఆమె ఎవరంటే
చాలా మంది హీరోయిన్ స్టార్ డమ్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. అలాగే తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు .
Updated on: Dec 07, 2025 | 3:43 PM

చాలా మంది హీరోయిన్ స్టార్ డమ్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. అలాగే తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాగే చాలా మంది హీరోయిన్స్ ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు.

ఈ చిన్నది కూడా వేరే భాష నుంచి వచ్చి తెలుగులో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో ఈ బ్యూటీ చేసిందే తెలుగులో మూడు సినిమాలు.. వాటిలో ఒక ఒక్క సినిమా హిట్ అయ్యింది. మిగిలిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. కానీ తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఈ అమ్మడు తెలుగులో సినిమాలుతగ్గించడంతో అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంతే కాదు మనకు వచ్చే లవర్ కూడా ఇలానే ఉండాలి అని కుర్రాళ్ళు అంతా అనుకునేలా తన అందంతో కవ్వించింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది. చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.

ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.




