- Telugu News Photo Gallery Cinema photos Do you know who this heroine turned wildlife photographer is, She is always
ఒకప్పుడు తోప్ హీరోయిన్.. నటనకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే
సౌత్ ఇండస్ట్రీ ఆమె టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.
Updated on: Sep 03, 2025 | 4:00 PM

సౌత్ ఇండస్ట్రీ ఆమె టాప్ హీరోయిన్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది.

దాదాపు నాలుగు పదుల వయసులోనూ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అప్పట్లో వరుస సినిమాలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. ప్రస్తుతం అడవులలో ఉండే జంతువుల ఫోటోస్ మరింత అందంగా తీస్తూ తనకు నచ్చిన రంగంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపేస్తుంది.

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ సదా. ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, బాలకృష్ణ, నితిన్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 2003లో నితిన్ హీరోగా నటించిన జయం సినిమాతో తెలుగు చిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో అందం, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

జయం సినిమా తర్వాత తెలుగు, తమిళం వరుస విజయాలు అందుకుంది. ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి ఈ అమ్మడు. జయం సినిమాతో యూత్ హృదయాలను కొల్లగొట్టిన సదా.. ఆ తర్వాత విక్రమ్ చియాన్ నటించిన అపరిచితుడు సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఆతర్వాత బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరించింది. అదే సమయంలో తనకు ఇష్టమైన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు, పక్షుల ఫోటోస్ మరింత అందంగా తీస్తూ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తుంది.




